filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 0; shaking: 0.037109; highlight: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0012,0.0003; brp_del_sen: 0.1000,0.1000; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 33;
– పేదలకు సంక్షేమం, అభివృద్ది దూరం చేస్తున్నారు
– మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: అబద్దాలు, దుష్ప్రచారం, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేదలకు సంక్షేమం, అభివృద్ది దూరం చేస్తున్నారని.. చంద్రబాబు మోసాలపై పోరాటం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు.
29వ డివిజన్ మధురానగర్ వీవీనరసరాజు రోడ్డులో సోమవారం సాయంత్రం రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ గుర్తుకు తెస్తూ ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబుకు వేసిన ఒక్క ఓటు వల్ల డివిజన్ వాసులు అక్షరాలా ఏడాదిలో రూ.6 కోట్లు నష్టపోయారని అన్నారు.
మహిళలను మోసం చేశారు..
చంద్రబాబు ఆర్బాటంగా హామీ ఇచ్చిన ఉచిత బస్సు పధకంను నిబంధనల పేరిట డొక్కు బస్సులకే పరిమితం చేస్తూ మహిళలను మోసం చేశారని దుయ్యబట్టారు. అలాగే ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇంత వరకు ఎందుకు అమలు చేయటం లేదని నిలదీశారు..
విద్యుత్‌ఛార్జీలు పెంచబోమని .. రాబోయే రోజులలో తగ్గిస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ఏడాది తిరక్కుండానే ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలు తీవ్ర అవస్ధలు పడుతున్నారని అన్నారు.తాము ప్రజలతో కలిసి విద్యుత్ఛార్జీలపై పెంపును వ్యతిరేకిస్తూ పోరాటం చేయనున్నట్లు తెలిపారు.
తాము మధురానగర్‌ను మోడల్డివిజన్గా తీర్చిదిద్దామని.. డివిజన్లో నూతనంగా ప్రజల అవసరాల మేరకు ఆర్యూబీ, పోలీస్‌స్టేషన్, కర్మల భవనం నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం డివిజన్లో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఇంటి పట్టాల కోసం సర్వం సిద్దచేస్తే ఉచితంగా ఇవ్వాల్సిన పట్టాలకు టీడీపీ నేతలు డబ్బులు వసూలు చే స్తున్నారన్నారు.
పేదల సొంతింటిని దూరం చేశారు..
పేదల స్వంత ఇంటికలను సాకారం చేసేందుకు జగన్మోహన్రెడ్డి కృషఙ చేశారని.. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా జగన్మోహన్రెడ్డి హయాంలో అమరావతిలో ఇచ్చిన పట్టాలను సైతం రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీప్రకారం పేదలకు ఉచితంగా ఇంటి స్ధలం ఇవ్వాలని లేని పక్షంలో తాము ప్రజల పక్షానం పోరాటం చేస్తామని హెచ్చరించారు..
వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉండాలని.. ప్రతిపక్షపాత్రను సమర్ధవంతంగా పోషించాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో క్లస్టర్ అధ్యక్షులు బోగాధి మురళి, పీ కంభం కొండలరావు, రామరాజు, సిద్దే సన్యాసిరాజు, పూర్ణ, బోనం నాగు, సుధాకర్, అక్బర్, శ్రీపతి కిషోర్, వాసు, జాక్షన్, ప్రియ, తదితరులు పాల్గొన్నారు.