తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పకుండా బయటకు వస్తారు
ఎన్నికలకు 5 నెలలే సమయం ఉంది
కురుక్షేత్ర సంగ్రామానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
కొంతమంది నేతలు పనితీరు మార్చుకోవాలి, మీకోసం పార్టీకి నష్టం చేయలేం
టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ విసృత స్ధాయి సమావేశం
చేయని తప్పుకు చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో జైలుకు పంపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ నేతలు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ విసృత స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాబు షూరిటి, భవిష్యత్తుకు గ్యారెంటీ ఇంటింటికి ప్రచారం, ఓటర్ వెరిఫికేషన్, నిజం గెలవాలి యాత్ర, పార్టీ సంస్ధాగత నిర్మాణం తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలకు నేతలు నివాళి అర్పించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ……
పిచ్చి జగన్ సంబంధం లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేశాడు. అక్రమంగా అరెస్టు చేయగలవేమో.. తెలుగు ప్రజల హృదయం నుండి తొలగించలేవు. దుర్మార్గుడి పాలనలో 5 కోట్ల ప్రజలూ అవస్థలు పడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా రేపు అధికారంలోకి రాబోయేది టీడీపీనే. రాష్ట్రానికి భవిష్యత్తు చంద్రబాబుతోనే అని ప్రజలు గుర్తించారు.
యువగళం పాదయాత్రకు వచ్చిన ప్రజాధరణ చూడలేక అణచివేసే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి కుయుక్తుల్ని ప్రజలు తిరస్కరించి యువగళానికి తోడుగా నిలిచారు. పులివెందులలో కూడా టీడీపీ కార్యక్రమాలకు జయప్రదం చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నాశనం చేశారు. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను చంద్రబాబు వివరించారు. 10రోజులు పర్యటించి ఎవరేం చేశారో ప్రజలకు వివరించారు. ఆ పర్యటనలతో జగన్ రెడ్డికి పిచ్చి పట్టి కుట్ర చేసి చంద్రబాబును అరెస్టు చేశాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ రెడ్డిది.
45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా చంద్రబాబు బతికారు.రూపాయి అవినీతి చేయకుండా బతికిన మహనీయుడు చంద్రబాబు. చంద్రబాబు దేశానిక సంపద అని తెలుగు జాతి మొత్తం హోరెత్తి చెబుతోంది.చంద్రబాబు లాంటి దార్శనికులు దేశానికి అవసరమని దేశమంతా చెబుతోంది. రూపాయి అవినీతి కనబడలేదు, కానీ అరెస్టు చేసి విచారిస్తామంటున్నారు. వేల కోట్ల అవినీతి అన్న వారు ఎందుకు ఆ మాటపై ఎందుకు నిలబడలేదు. తొలుత రూ.3వేల కోట్లు, తర్వాత రూ.300 కోట్లు అన్నారు.
చివరాఖరికి ఎలక్టోరల్ బాండ్స్‌ని అవినీతి అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత రూ.8.5 కోట్లు అవినీతి అంటూ కోర్టుకు చెప్పారు.తన లాగానే అందరూ అవినీతికి పాల్పడతారు అనేలా జగన్ వ్యవహరిస్తున్నారు. సభ్యత్వం కోసం కార్యకర్తలు చెల్లించిన సొమ్మును స్కాం అంటున్నాడు.స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు పరికరాలిచ్చిన కంపెనీ ఎగ్గొట్టిన జీఎస్టీని చంద్రబాబుకు ఆపాదించారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించడానికి కోట్లలో ప్రజల సొమ్ము వాడుతున్నాడు.కృష్ణా ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలపై పోరాడేందుకు లాయర్లని పెట్టలేదు. చంద్రబాబును ఇరికించేందుకు కోట్లాది ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నాడు.
కానీ ప్రజల కోసం రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు.చంద్రబాబు తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలంతా గుర్తించారు, తోడుగా నిలుస్తున్నారు. జగన్ రెడ్డి జైలుకు వెళ్తే.. ఇంట్లో కుక్క కూడా మొరగలేదు. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్కరూ స్పందించలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి వేల కోట్లు తిన్నాడని ప్రజలంతా గుర్తించారు. ఏ నాడైనా ఐటీ ఉద్యోగులు రోడ్డెక్కడం చూశామా.చంద్రబాబు చేసిన సాయం గుర్తు తెచ్చుకుని 70దేశాల్లో రోడ్డెక్కారు. బయటకు రానీయకుండా పోలీసులతో అడ్డుకునే కుట్ర చేస్తున్నాడు. కానీ మహిళలు స్వచ్ఛందంగా బయటకొచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడనై ఉంటాను.
జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలిచ్చారు. లక్షల మందికి శిక్షణ ఇచ్చి లక్షల్లో వేతనాలతో ఉద్యోగాలొచ్చేలా చేశారు. నిన్నటికి నిన్న ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ ఎంతో అవసరమని చెప్పారు.అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు.దేశం గుర్తించని సమయంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ గుర్తించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రాబోతున్నారు.
కురుక్షేత్ర సంగ్రామానికి పార్టీ నాయకులంతా సిద్ధంగా ఉండాలి. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికల్లో గెలిచేయాలనుకుని భంగపడ్డాడు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగాభ్రష్టుపట్టించాడో గడపగడపకూ చెప్పాలి.రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ మనతో కలిశారు. ఈయనకు ఈ సభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడ నుంచే జగన్ రెడ్డి రాజకీయ జీవితం అంతానికి పిలుపు. జగన్ రెడ్డి లాంటి ఐరెన్ లెగ్ వలన రాష్ట్రంలో కరువు తాండవం వేస్తుంది. పట్టిసీమ ఆన్ చేస్తే బాబు గారికి పేరు వస్తుందని కావాలనే నీళ్లు వదల్లేదు. జగన్ రెడ్డికి ధనదాహం, పిచ్చి, ప్రతిరోజూ వేల కోట్లు చూడకపోతే నిద్ర పట్టదు. సహజ వనరులు, మధ్యం, మైన్స్‌ను దోచుకుంటున్నారు.
ఒంగోలులో పేదల వాళ్ల వేల ఎకరాలు దోచుకున్న జగన్ రెడ్డి బంధువుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15వరకు జనసేనతో కలిసి చేయాలి. నేడు రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. వారికి బుద్ది చెప్పాలి. భవిష్యత్ గ్యారెంటీతో పాటు ఓట్ల జాబితా కార్యక్రమాన్ని కలిపి చేయాలి. తప్పు చేయని వ్యక్తిని 43 రోజులుగా అరెస్ట్ చేస్తే ఆ ఇళ్లాలు ఎంత విలవిలలాడుతుందో చూడాలి. అందుకే నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభిస్తారు. అందరం కలిసి కట్టుగా పని చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దపడాలి. పెద్దిరెడ్డి మనిషివేనా, నీకు మానవత్వం ఉందా?
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా పసుపు కండువ వేసుకొని సైకిల్ యాత్ర చేస్తే అడ్డుకుంటావా? టీడీపీ గెలిచిన తరువాత రేపు పెద్ది రెడ్డి ఎక్కడుంటావు? ఏ అధికారి టీడీపీ కార్యక్రమాలను అడ్డుకున్నారో, దాడులకు పాల్పడ్డారో వాళ్లందరికి చక్రవడ్డీతో తిరిగిస్తాం.ఈ రాష్ట్రానికి పట్టిన జగన్ రెడ్డి ఆయనను వదలించుకోవడానికి కష్టపడి పని చేద్దామని అచ్చెన్నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు సాధిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ…
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల సహాయంతో ఓట్ల అక్రమాలకు పాల్పడుతోంది.ఓట్లను, బూత్‌లను జంబ్లింగ్ చేసి వాలంటీర్లతో అక్రమాలు చేయిస్తున్నారు.తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లతోనే వైకాపా విజయం సాధించింది.వైకాపా దొంగ ఓట్ల కార్యక్రమాలకు అడ్డుకట్టవేయాలి.పార్టీ నాయకులు జిల్లా స్థాయిలో జరిగే ఓట్ల సమీక్ష సమావేశాలకు హాజరై అభ్యంతరాలు నమోదు చేయాలి.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపించే నాయకుడిని జైల్లో పెట్టారు. భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.తెదేపా కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చ్చారు.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ…
యువతకు ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబునాయుడు ముందుచూపుతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుచేసింది నిజం. 42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు స్థాపించడం నిజం. అందులో లక్షల విలువచేసే పరికరాలు ఉన్నమాట నిజం. లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వేలాది మంది యువత ఉద్యోగాలు పొందిన మాట నిజం.
ఒక్క ఆధారం కూడా చూపకుండా రాజకీయ కక్షతో అక్రమ అరెస్ట్ చేయడం నిజం. రూ.5,598 కోట్ల వ్యయం అయ్యే ఫైబర్ నెట్ ప్రాజెక్టును చంద్రబాబునాయుడు రూ.270 కోట్లకు పూర్తిచేసి మారుమూల ప్రాంతాలకు టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ ఇచ్చిన మాట నిజం. జగన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్న గ్రామ సచివాలయాలు కూడా ఈ ఫైబర్ నెట్ ద్వారానే కార్యకలాపాలు సాగిస్తున్న మాట నిజం. కరోనా సమయంలో దేశవిదేశాల్లోని తెలుగువారు రాష్ట్రానికి వచ్చి ఈ ఫైబర్ నెట్ ద్వారానే వర్క్ ఫ్రమ్ హోం ద్వారా తమ ఉద్యోగాలు నిర్వహించిన మాట నిజం.
ఫైబర్ నెట్ ద్వారా ఆధునిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు చంద్రబాబు అన్న మాట నిజం. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు రూపకల్పన చేసి ఆ నగర రూపురేఖలను చరిత్రలో నిలిచిపోయేలా చేసిన ఘనత చంద్రబాబునాయుడుది అన్నమాట నిజం. అదేవిధంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేయాలని చంద్రబాబునాయుడు కన్న కల నిజం. ఇన్నర్ రింగ్ రోడ్డు కార్యరూపం దాల్చలేదన్నది నిజం. సెంట్ భూమి కూడా సేకరించలేదన్నది నిజం.
ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నది నిజం. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నది నిజం. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి చంద్రబాబునాయుడుపై వైసీపీ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నది నిజం. ఈ నిజాలన్నీ ప్రజలకు తెలియాలి. 107 దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు తెలియాలి. ఈ నిజాలను నిలబెట్టాలి. న్యాయస్థానాల చెవులు మారుమోగేలా నిజాలు వినిపించాలి. తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, భర్త ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ఏనాడూ దర్పం చూపించని మహాసాధ్వి భువనేశ్వరమ్మ.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1997 నుంచి ఈ క్షణం వరకు ఉచితంగా పేదలకు విద్య, వైద్యం అందించడమే కాకుండా కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ అప్పటికప్పుడు స్థాపించి, అవసరమైన మందులు పంపిణీ చేసి, కొన్ని వేలమంది ప్రాణాలు కాపాడిన అమ్మ భువనేశ్వరమ్మ. అకాల వర్షాల వల్ల అన్నీ పోగొట్టుకున్న బాధితులకు అండగా నిలిచి వారికి నిత్యావసర సరుకులతో పాటు వైద్యం అందించిన మానవతావాది భువనేశ్వరమ్మ.
భువనేశ్వరి గారిని వైసీపీ నేతలు అవమానించినా, తన భర్తను అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధించినా 43 రోజులుగా అన్నీ దిగమింగుకుని కార్యకర్తలను తన బిడ్డలుగా తలచి, చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ‘నిజం గెలవాలి’ పేరుతో ముందుకు రాబోతున్నారు. నిజాన్ని గెలిపిద్దాం, నిజాన్ని నిలబెడదాం. భువనేశ్వరి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు.
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ….
ఎన్నికలకు కొద్ది సమయమే ఉంది కనుక గ్రామ స్ధాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్ధాయి నేత వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. కొన్ని నియోజకవర్గాలలో క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారధుల నియామకాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎలక్షన్ కి కేవలం 120 రోజుల సమయం మాత్రమే ఉంది కనుక ఈ నియామకాలు తొందరగా పూర్తి చేసుకోవాలి. పార్టీ మెయిన్ కమిటీలోని గ్రామ, మండల, పార్లమెంట్ వారీగా కమిటీల పెండింగ్ నియామకాలు కూడా పూర్తి చేసుకుని ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పోరాడాలి.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని బాధపడుతూ కూర్చుకుంటే లాభం లేదు, ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు కష్టపడదాం. తాను ముఖ్యమంత్రిగా గెలిస్తేనే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు నాయుడు శపదం చేశారు. ఆయన మాట నిలబెట్టి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన భాద్యత మనదేదని, అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని రామానాయుడు అన్నారు.
సమావేశం ముగింపులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ….
చేయని తప్పుకు చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో జైలుకి పంపారు. జగన్ రెడ్డి కుట్ర రాజకీయాల్ని వైసీపీ ఎంపీలు సైతం తప్పు పడుతున్నారు. నేను డిల్లీ వెల్లినప్పుడు వారే స్వయంగా నన్ను కలిసి జగన్ చేసింది తప్పు దానికి తగిన మూల్యం చెల్లించకతప్పదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి అన్ని రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.
చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు. గతంలో పింక్ డైమండ్, రూ. 6 లక్షల కోట్ల అవినీతి అంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. నిరూపించారా? మన నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా బయటకు వస్తారు. ఈ లోపు మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి.
ఎన్నికలకు 5 నెలలే సమయం ఉంది, కొంతమంది నేతల పనితీరు ఇంకా మారాలి. ఒకటికి రెండు సార్లు చెబుతాం, మారకుంటే కష్టం. మెహమాటానికి వెళ్లి పార్టీకి నష్టం చేయలేం. సోషల్ మీడియాపై కూడా దృష్టిసారించండి, పేక్ అకౌంట్లతో టీడీపీ జనసేన కార్యకర్తల మద్య వైసీపీ పేటెమ్ బ్యాచ్ గొడవలు సృష్టిస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాలి.
మనం నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి చేయండి, ఈ 5 నెలలు మనకు చాలా కీలకం. నాకు పండుగ లేదు, పబ్బం లేదు, పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి నిరంతరం ప్రజల మద్యే ఉంటున్నా. పాదయాత్ర ప్రారంభించాక ఒక్క సారే ఇంటికెళ్లా. మూడు నెలల తర్వాత దేవాన్ష్ ని చూశా. ప్రత ఒక్కరు కష్టపడండి. వైసీపీ వైఫల్యాలు, అరాచకాలు ప్రజల్లో ఎండగట్టి చైతన్యం చేయాలి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160 స్ధానాలు గెలవటం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు నేతలు అడిగిన సందేహాలను లోకేశ్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్ చార్జులు, మాజీ మంత్రులు, , మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.