-వి.విజయసాయిరెడ్డి
భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును గుర్తుచేసుకోవాల్సిన అవసరం లేదు.
–అయితే, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధాని ఎంపిక నుంచి 2002లో రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాంను చేయడానికి అందరినీ ఒప్పించే విషయం వరకూ చంద్రబాబు పాత్ర లేనే లేదు.
–ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం –ఇద్దరు యునైటెడ్ ఫ్రంట్ ప్రధానులు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, రాష్ట్రపతులుగా ఏపీజీ అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ ఎంపికలో తనకు క్రియాశీల పాత్ర ఉందని గతంలో చాలాసార్లు గొప్పలు చెప్పుకున్నారు.
–వాస్తవానికి చంద్రబాబుకు జాతీయ రాజధాని న్యూఢిల్లీ ప్రధాన వీధులు పరిచయం అయినది 1996లోనే. లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ప్రధానిని ఎంపికచేసిన సందర్భంగా అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హర్కిషన్ సింగ్ సుర్జీత్ ప్రధాన పాత్ర నిర్వహించారు. వయోవృద్ధుడైన సుర్జీత్కు సహాయకుడి పాత్రలో చంద్రబాబు ఆయన వెంట రెండు రోజుల పాటు దిల్లీలో తిరిగారు.
–1996లో మాత్రమే హస్తిన రాజకీయాలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు కొంత అవగాహన కలిగింది.
–1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానిగా దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబుది కమ్యూనిస్టు అగ్ర నేతలకు సహాయకుడి పాత్ర మాత్రమే.
–ఇద్దరు ప్రధానులు గౌడ, గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబుది నిర్ణాయక పాత్ర కాదు.
–2002లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఏపీజే అబ్దుల్ కలాం ఎంపికలో సమాజ్వాదీ నేత ములాయం సింగ్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారు. చంద్రబాబు కేవలం కలాం అభ్యర్థిత్వం విషయం గురించి కొందరు నేతలకు ఫోన్లో సమాచారం మాత్రమే ఇచ్చారనేది అసలు వాస్తవం. కలాంను దేశాధినేతగా ఏ నేతనూ ఒప్పించే పని చంద్రబాబుకు ప్రధాని ఏబీ వాజపేయి ఇవ్వనే లేదు.
–అలాగే, 2007లో రాష్ట్రపతి పదవికి మాజీ గవర్నర్ ప్రతిభా పాటిల్ ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, దానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల అంతర్గత వ్యవహారం. ఇందులో తల పెట్టే చాన్స్ చంద్రబాబుకు ఏమాత్రం రాలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి ప్రతిభా పాటిల్ విధేయతే ఆమె రాష్ట్రపతి కావడానికి దోహదం చేసింది.
–2012లో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీచేసినప్పుడు సైతం ఈ నిర్ణయం పూర్తిగా అప్పటి కాంగ్రెస్, యూపీఏ అధినేత సోనియాగాంధీదే.
–దేశ రాజధానిలో ఏ ప్రధాని, ఏ రాష్ట్రపతి ఎంపికలోనూ టీడీపీ అధ్యక్షునిగాగాని, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ మిత్రుడిగా గాని చంద్రబాబుది ఏ క్షణంలోనూ కీలకపాత్ర కాదు. నిర్ణాయక పాత్ర అంతకంటే కాదు.