Suryaa.co.in

Andhra Pradesh

కందుకూరు ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

ప్రకాశం జిల్లా:- కందుకూరు ఘటనలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబ సభ్యుల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున రూ.15 లక్షల ఆర్ధికసాయం చేశారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో మృతురాలి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏడుగురుకి ఇప్పటికే స్వయంగా చంద్రబాబు వాళ్ళ ఇళ్లకు వెళ్లి సాయం అందించారు.

నేడు పెట్లూరులో మృతురాలు రాజేశ్వరి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అక్కడికి వచ్చిన గ్రామస్థులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. “కందుకూరు ఘటన బాధాకరం. రాజకీయ నేతలు పర్యటనలకు వెళ్ళినప్పుడు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయాలి. పరదాలు కట్టుకుని వెళ్ళే సీఎం దగ్గరకు మాత్రం పోలీసులు వెళ్తున్నారు. నందిగామలో నాసభలో రాయి విసిరితే పోలీసులు సీరియస్ గా తీసుకోలేదు. కర్నూలులో ఇలాగే వైసీపీ మూకలు వస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఇది మంచి విధానం కాదు.

నా రాజకీయ జీవితంలో చూడనంత జనం ఇప్పుడు నా సభలకు వస్తున్నారు. కందుకూరు ఘటన సమయంలో నేను అప్రమత్తం చేశాను. కానీ పోలీసులు ఎక్కడా కనిపించలేదు. వెంటనే బాధితులనుncb1 చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళాను. మీటింగ్ రద్దు చేసుకున్నాను. పార్టీ ద్వారా, నేతల ద్వారా కలిపి రూ.25 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఇచ్చాము. కందుకూరు ఘటనలో 8 మంది కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం. అలాంటి బాధలో ఉంటే మనపై నీతి మాలిన విమర్శలు చేస్తున్నారు. మీరు మనుషులేనా అని అడుగుతున్నాను.

నేను సీఎంగా ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించా..కానీ ఈ వైసీపీ నేతల మాదిరి ఎప్పుడూ వ్యవహరించలేదు. రాష్ట్రంలో కచ్చలూరు బోటు ప్రమాదం జరిగితే సీఎం జగన్ వెళ్ళలేదు. అన్నమయ్యncb డ్యాం కొట్టుకు పోతే కూడా జగన్ వెళ్ళలేదు. అక్కడికి నేను వెళ్లి సాయం చేశా. ఇదీ సీఎం జగన్ వైఖరి. 2023లో బాధలన్నీ తొలగిపోయి….అందరికీ మంచి జరగాలి” అని చంద్రబాబు ఆకాక్షించారు.

LEAVE A RESPONSE