Suryaa.co.in

Andhra Pradesh

నాపై పోటీ చేసి చంద్రబాబు గెలవాలి

– గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

నూజివీడు సీటు 2009 లో ఇస్తే నా వల్ల కాదని పారిపోయిన సంగతి మర్చిపోయావా? విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తే లగడపాటి మీద ఓడిపోయావు.జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం కలిపి 30 వేలు మెజారీటి ఇచ్చాము.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోల్ మేనేజిమెంట్ చేసుకోవడం చేతకాక బొక్కబోర్ల పడ్డావు గుర్తుందా?

పులి, సింహం అని చెప్పుకొని తిరిగింది మా పార్టీ గొడుగు కింద ఉన్నంతవరకే!గన్నవరం బ్రహ్మ లింగం చెరువుకు 15 కోట్ల APSIDC లిఫ్ట్ స్కీం ఇచ్చాడు చంద్రబాబు.. రైతులతో సర్దిచెప్పుకోలేక పక్కన పడేశావు.విజయవాడ సిటీ మురుగు నీరు ఏలురు కాలవలో కలుస్తుందని.. అంపాపురం దగ్గర ఏలురు కాలువ డైవర్షన్ కోసం 100 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు..ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.. నువ్వు శంకుస్తాపన పెట్టించి పోటుగాడివని నిరూపించుకో..ఇప్పటికీ సిగ్గుపడుతున్నా..నేను, నా తండ్రి పోలీసు లాఠీ దెబ్బలు తిన్నది నీలాంటోడి కోసమా అని..గోడలు దూకినంత ఈజీ కాదు రాజకీయం అంటే.. అపరాధబావం నీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందిలే.

LEAVE A RESPONSE