– రాజధాని విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తప్పేం ఉంది?
– వ్యవస్థల మీద దాడులు చేయడం సీఎం జగనుకు అలవాటుగా మారింది
– జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసం రెడ్డి
– బినామీలుంటే మూడేళ్లు ఏం పీకారు?
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
శాసనసభలో న్యాయవ్యవస్థపై సీఎం జగన్, మంత్రులు, శాసనసభ్యులు మాట్లాడిన తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అన్ని వ్యవస్థలపై దాడులు చేయడం జగన్‌కు అలవాటయిందన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
శాసన సభలో మూడు రాజధానుల ముచ్చట తెచ్చి.. మూడు ముక్కల ఆటకు మళ్లీ శ్రీకారం చుట్టారు.భావితరాల భవిష్యత్తుపై ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాజధాని విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తప్పేం ఉంది..?ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించాలి.. చట్ట సభలు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలు రాజ్యాంగం చెబుతుంది.
వితండ వాదన చేస్తున్నారు…. కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా చట్టాన్ని చేయలేరు.ప్రజలను చంపేస్తామని చట్టం చేయలేరు.ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదు.చట్టాలను న్యాయసూత్రాలకు అనుగుణంగానే చట్టాలు చేయాలి.
నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉంది.తాము చెప్పిందే వేదం అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.నాటి సభలో వైసీపీ కూడా అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించింది.ఇప్పుడు చెబుతున్న మాటలే.. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు..?
ప్రేమ ఉంది కాబట్టే ఇల్లు కట్టుకుంటున్నానని సీఎం చెబుతున్నారు. ఇల్లు ఉంటే సరిపోదు.. మంచి మవస్సు ఉండాలి.నమ్మక ద్రోహం చేసిన వైసీపీకి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు.ఒకసారి రాజధానిని నిర్ణయించిన తర్వాత మార్పు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పని సరి అని చట్టం చెబుతోంది.
అలాగే రాజధాని రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయి.రాష్ట్రానికి శనిగ్రహం మాదిరి దాపురించారు.రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలీని వాళ్లు శాసనసభ్యులుగా ఉన్నారు.
చేతనైతే రాజధాని అమరావతి అంశంపై ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాభిప్రాయం కోరండి. విభజన చట్టం ప్రకారం ఒక రాజధాని ఏర్పాటు నిర్ణయాన్ని ఇప్పటికే వినియోగించుకున్నాం. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు విలువ తెలీని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం.రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ.సీఎం జగన్ అడుగడుగునా మోసం.. అడుగడుగునా అబద్దాలు చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసం రెడ్డి.వ్యవస్థల మీద దాడులు చేయడం సీఎం జగనుకు అలవాటుగా మారింది.
శాసన మండలిని రద్దు చేస్తామంటారు.. ఎస్ఈసీని విమర్శిస్తారు.. సీబీఐపై కేసులు పెడతారు.. ఓ ఎంపీని చంపే ప్రయత్నం చేస్తారు.. ఇలాంటివి చేస్తే కోర్టులు ప్రశ్నించవా..? ల్యాండింగ్ పూల్ చేస్తే రియల్ ఎస్టేటంటారు.. బినామీలంటారు. బినామీలుంటే మూడేళ్లు ఏం పీకారు..? ఇల్లు కట్టుకోలేదంటారు.. బినామీలంటారు.రాజ్యాంగంలో.. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం.
ఐదేళ్లపాటు ట్రస్టీగా ఉండమన్నారే తప్ప.. అరాచరాలు చేయమని చెప్పలేదు.ఏదైనా చేస్తా.. చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటు.ఇష్టం వచ్చినట్టు చేస్తే భయపడాలా..? స్టేట్ టెర్రరిజమా..?ప్రజాస్వామ్యాన్ని హరిస్తారా..?
ప్రజాస్వామ్యంలో పాలకులు సున్నితంగా ఉండాలి.ప్రతి ఒక్కర్ని కాళ్ల బేరానికి రప్పించుకుంటారా..?రాష్ట్రంలో గౌరవంగా బతికే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు.చట్ట ప్రకారమే అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. చేసిన చట్టాన్ని ఉల్లంఘించడానికి ఈ సీఎం ఎవరు..?
ప్లాట్లు ఇచ్చారు కాబట్టి కొందరు జడ్జీలు వాదనలు వినడానికి వీల్లేదంటారా..? సీఎంకు ఎవరిస్తున్నారు జీతం. న్యాయం చేయాలని పిటిషనర్లు కోర్టుకు వెళ్తే.. కోర్టు తీర్పు ఇస్తోంది. ఓ సీనియర్ నాయకుడిగా చెబుతోన్నా..ప్రభుత్వమే హద్దులు దాటుతోంది.. కోర్టుల పరిధి గురించి మాట్లాడ్డం సరైన విధానం కాదు.అసలు కోర్టులు తీర్పే ఇవ్వకూడదని ప్రభుత్వం ఆలోచనలా ఉంది. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక.. వారికేమైనా ఇబ్బంది కలిగితే కోర్టుకు వెళ్లరా..?పరిధులు దాటకుండా చర్చ జరపాలి.
రాజధాని అభివృద్ధి విషయంలో మూడేళ్ల పాటు ఏం చేశారు..?రాజధాని రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసమా..?అభివృద్ధి పనులు మొదలు పెట్టి అమల్లో జాప్యం ఉంటే అదే విషయాన్ని కోర్టులకు చెప్పొచ్చు.ఆ విషయం మానేసి.. కోర్టులను తప్పు పడతారా..?
నేను ప్రజల ఆస్తులను ధ్వంసం చేయలేదు.. ప్రజల ఫండమెంటల్ రైట్ మీద దాడి చేయలేదు. ప్రజాహితమైనప్పుడు.. ఒప్పందాలు ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వాలు కొనసాగించాల్సిందే. గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయమని కేంద్రం చెబుతుందా..?
ప్రజల కోసం పాలసీలు చేయాలి కానీ.. విధ్వంసం కోసం పాలసీలు చేయకూడదు.వైఎస్ హయాంలో చేసిన పాలసీలు కంటిన్యూ చేయలేదా..?జగన్ తాత్కాలికం.. ప్రభుత్వం శాశ్వతం.విశాఖలో ఒక్క ఇటుకైనా పెట్టారా..?ఇప్పుడు 25 జిల్లాలు రాబోతున్నాయి.. 25 రాజధానులు పెట్టి తిరుగుతారా..?రోటేషన్ క్యాపిటల్ పెడతారా..?