– ముఖ్యమంత్రి హోదా లో నిర్వహించే అదృష్టం
(రమణ)
పన్నెండు ఏళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మంగా జరిగే గోదావరి పుష్కరాలను వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి హోదా లో నిర్వహించే అదృష్టం చంద్రబాబు నాయుడు దక్కించుకోనున్నారు. మొదటిసారి 2003లో పుష్కరాలను ప్రారంభించిన చంద్రబాబు 2014 గోదావరి మహా పుష్కరాలను వైభవంగా చేపట్టారు.
మూడోసారి అంటే.. 2027 లో జరిగే గోదావరి పుష్కరాలు ఈయన నేతృత్వంలోనే జరుగుతుండడం విశేషం. ఈ గోదావరి పుష్కరాలను రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో చేపట్టిన నేత ఎవరు లేరు. అలాంటిది మూడోసారి నిర్వహించబోతుండటం విశేషంగానే పేర్కొచ్చు. అంతకుముందు 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి,1979లో మర్రి చెన్నారెడ్డి లు ముఖ్యమంత్రిలుగా గోదావరి పుష్కరాలు చేపట్టారు.