Suryaa.co.in

Andhra Pradesh

ఉదయగిరి నారాయణ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ

– రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ
– పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడన్న వాదనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లేఖలో కోరిన చంద్రబాబు

లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్న అంశాలు:-
రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనారిటీలు, మహిళలు,వెనుకబడిన తరగతుల (బిసి) వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ మరణం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వర్గం పోలీసుల క్రూరమైన పనితీరుకు నిదర్శనం.
అధికార పార్టీకి చెందిన వారి ప్రోద్భలంతో పోలీసులు విచారణ పేరుతో నారాయణను జూన్ 17 కస్టడీకి తీసుకుని చిత్ర హింసలకు గురి చేశారు.
అనంతరం 19 జూన్ 2022న, నారాయణ అనుమానాస్పద స్థితిలో తన గ్రామ శివార్లలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.
తనను కస్టడీలో తీవ్రంగా హింసించారని నారాయణ తన కుటుంబ సభ్యులకు ముందుగానే తెలిపాడు.
నారాయణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
విచారణ పేరుతో నారాయణను అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అతని మరణానికి కారణమయ్యారు.
పోస్ట్ మార్టం అనంతరం నారాయణ మృతదేహాన్ని కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఖననం చెయ్యాల్సిన ఉండగా దహనం చేశారు.
నారాయణ మృతి కేసులో తదుపరి విచారణ వద్దని ఆయన కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు.
ఈ ఘటనలో పొదలకూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పాత్రపై సమగ్ర విచారణ జరపడం చాలా ముఖ్యం.
నారాయణ పోస్ట్‌మార్టం నివేదికను బహిరంగపరచాలి. నారాయణ కుటుంబానికి 50 లక్షలు ఆర్ధిక సాయం అదించాలి.
మొత్తం ఘటనపై జ్యుడిషియల్ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలి.
CS కు రాసిన లేఖ ప్రతిని డీజీపీ కి పంపిన చంద్రబాబు

LEAVE A RESPONSE