ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో ఎటువంటి అక్రమాలూ లేవు
రోజుకో కేసుతో బురదజల్లడమే వైసీపీ విధానం
రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు
ఎం.ఎస్.స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారు
-చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి నారాయణ
రాజమహేంద్రవరం :- వ్యవసాయరంగానికి ఎంతో సేవ చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి, దేశానికి చేసిన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారని పేర్కొన్నారు. స్వామినాథన్ కుటుంబానికి తన సంతాపం తెలియ జేయాలని చంద్రబాబు కోరినట్లు అన్నారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో భువనేశ్వరి, బ్రాహ్మణితో కలసి నారాయణ చంద్రబాబునాయుడుతో ములాఖత్ అయ్యారు.
అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్నా చంద్రబాబు ఆలోచన రాష్ట్రం, ప్రజలే. చంద్రబాబు అక్రమ కేసుతో జైల్లో ఉండడం బాధాకరమైనా…జైలులో చంద్రబాబు మనోదైర్యంగా ఉన్నారు.‘తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు, మద్ధతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పాలని, అధికార పార్టీ చేసే అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించాలని చంద్రబాబు చెప్పారు అని నారాయణ అన్నారు.
ఇంకా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కు మద్దతు తెలిపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు పర్యటనకు రాష్ట్రం లో వస్తున్న ప్రజా స్పందన చూసే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నారాయణ అన్నారు. రింగ్ రోడ్డు అంశంలో లోకేష్ పైనా కేసు పెట్టారు..దీనిపై 41ఏ నోటీసులు ఇస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు..ఇది మా మొదటి విజయం. రాష్ట్రంలో వైసీపీ ఏం చేస్తోందో ప్రజలందరికీ తెలుసు.
టీడీపీకి ప్రజల నుండి వచ్చే మద్ధతును వైసీపీ ఓర్చుకోలేక పోతుందని…అందుకే కేసులు, అరెస్ట్ లు చేస్తుందని నారాయణ అన్నారు. అయినా పార్టీకి రెండింతల బలం పెరుగుతోంది. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. రైతులు, ఉద్యోగులు, కూలీలు, యువత అందరూ ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు అరెస్టు చేయడం రాజకీయ కక్షే..దీనికి వైసీపీ కి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు అని అన్నారు.
ఈడ్పుగల్లులో 40 సెంట్ల భూమిని నేను 2001లో కొన్నాను. ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ ప్లానింగ్ లో ఆ భూమి పోయింది. ఆ భూమి పోయిందని సీఆర్డీఏ అధికారులే మాకు సమాచారం ఇచ్చారు. రూ.7 కోట్ల విలువ చేసే నా భూమి పోతే..నేనెలా ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి పాల్పడతాను.? ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజం అయిపోవు. మా బంధువులు కొన్న భూములు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు 7 కి.మీ దూరంలో ఉన్నాయి.
వైసీపీకి సాక్షి పత్రిక ఉందని బురదజల్లడమే తెలుసు. మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. టీడీపీ-జనసేన పొత్తుపైనా త్వరలో కమిటీ నియామకం అవుతుంది..కమిటీ నిర్ణయాల ప్రకారం ప్రకారం ముందుకు వెళ్తాం. చంద్రబాబు జైల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు..అయినా తప్పలేదు.’’ అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.