ఆ అబ్బాయికి అదంతా ఒక కలా? లేక కళ్ళముందే జరుగుతున్న అద్భుతమా? నమ్మలేనంత ఆనందంలో మునిగి తేలుతున్నాడు. తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్న 9వ తరగతి విద్యార్థి చరణ్ తేజ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్న క్షణం అది.
ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో అతని కళ్ళు నిండిపోయాయి. ఆ ఆనందాన్ని ఆపుకోలేక, కృతజ్ఞతతో బాబు పాదాలకు నమస్కరించి, ఆయన్ను గట్టిగా హత్తుకొని వెక్కివెక్కి ఏడ్చేశాడు. ఆ క్షణాన చరణ్ అనుభవించిన సంతోషం, కృతజ్ఞత, ఆశ్చర్యం… అన్నీ కలిసి కన్నీరుగా మారాయి. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆనందించారు. విద్యాశాఖాధికారి గారు ఆ అబ్బాయిని సముదాయించారు. ఇది కేవలం ఒక సన్మానం కాదు, ఒక చిన్నారికి జీవితాంతం గర్వంగా చెప్పుకొనే ఒక అద్భుత క్షణం!