-పులివెందులలో టిడిపి కార్యకర్త పరమేశ్వర్ రెడ్డి హత్యపై ఎపి డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ
-హత్య కేసు నిందితులు అందరినీ అరెస్టు చెయ్యాలని లేఖలో కోరిన నారా చంద్రబాబు నాయుడు
లేఖలో అంశాలు:-
• ఎపిలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి…ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
• 2022 సెప్టెంబర్ 19వ తేదీన సింహాద్రిపురం మండలం, దిద్దెకుంట గ్రామానికి చెందిన పెద్దసోమప్పగారి పరమేశ్వర రెడ్డిని దారుణంగా హత్య చేశారు.
• తండ్రి హత్య పై 8 మంది పై ఆయన కుమారుడు అనిక్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
• పల్లేటి హరినాథ రెడ్డి కుట్ర చేసి హత్యకు పాల్పడినట్లు అదే రోజు ఫిర్యాదు చేశాడు.
• అయితే ఈ కేసులో ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు.
• హత్యలో కుట్రదారుగా ఉన్న వ్యక్తి సహా ఇతర 5గురు నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతున్నారు.
• అధికార పార్టీకి చెందిన ఈ 5గురి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోంది
• హత్యకు కారణం అయిన వారందరినీ అరెస్టు చెయ్యాల్సి ఉన్నా పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
• ఈ కేసులో ద్యర్యాప్తు ప్రక్రియను సమీక్షించి న్యాయం చెయ్యాల్సిన బాధ్యత మీపై ఉంది.