కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ పై చీఫ్ సెక్రటరీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ
శాంతిపురం మండలంలోని ముద్దన పల్లె గ్రామంలో గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై లేఖలో ఫిర్యాదు.గత నెలలో జరిపిన తన కుప్పం పర్యటనలో అక్రమా క్వారీయింగ్ పై స్వయంగా పరిశీలన జరిపానన్న చంద్రబాబు.కుప్పం నియోజకవర్గం మైనింగ్ లో అక్రమాలు నిజమేనని అధికారులు నిర్థారించారన్న చంద్రబాబు.అధికారుల తనిఖీల తరువాత కూడా ముద్దన పల్లి గ్రామంలో 104,213 సర్వే నెంబర్లలో అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది.అధికార పార్టీ నేతలు ఈ అక్రమ మైనింగ్ లో భాగస్వాములు అయ్యి ఉన్నందున బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు.వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది.కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ అక్రమ తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.