-ఎమ్మార్పీకి మించి అమ్మితే కొరడా ఝళిపించండి
– మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
– కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
– మద్యం ధరల విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: ఎక్సైజ్ పాలసీని కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ సమీక్షలో ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు..
• మద్యం షాపుల్లో ఎవరైనా MRP ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సిఎం ఆదేశం
• ఎంఆర్పికి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
• ఎట్టిపరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమతించవద్దని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశం
• బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ. 5 లక్షలు అపరాధ రుసుము విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని సిఎం ఆదేశం
• ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న సీఎం…NDPL రాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం
• అదే విధంగా ID లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి
• ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశం
• ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
• ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలని ఆదేశం
• మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచన
• అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై తాజా పరిస్థితిని వివరించిన అధికారులు
• ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్ ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశం
• పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేసిన సిఎం
• ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సిఎం
• ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
• మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని…దాన్ని క్షేత్ర స్థాయి వరకు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న ముఖ్యమంత్రి
• ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు స్పష్టం చేసిన సీఎం .