– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
కంచికచర్ల: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఆదివారం కంచికచర్ల మున్నలూరు గ్రామంలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యే సౌమ్య కు గ్రామ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పూలజల్లులతో స్వాగతం పలికారు.
ఆమె మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దైర్జన్యాలు, అవినీతి అక్రమాలు తప్పా ప్రజలకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. ఎన్నికల్లో ఆదరించి ప్రజలు మంచి మెజార్టితో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ కష్టమొచ్చినా తప్పక ఆదు కుంటానని హామీ ఇచ్చారు.
కంచికచర్ల మండలం మున్నలూరు పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సౌమ్యకి గజమాలలతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తదుపరి అదే గ్రామం లో రైతు సాగులకు ఉపయోగపడే శ్రీ సంగమేశ్వర పంపింగ్ స్కీమును ప్రారంభించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య .