Suryaa.co.in

Andhra Pradesh

స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన చంద్రన్నకు జగన్ రెడ్డికి పోలికే లేదు

– మహిళలకు ఆస్తిలో సగం, ఎన్నికల్లో రిజర్వేషన్లు అంటూ స్త్రీ అభ్యున్నతి ప్రగతి బాట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది
– డ్వాక్రాకు జగన్ రెడ్డి తూట్లు పొడిచాడు. డ్వాక్రా పొదుపు నిధులను కాజేశాడు
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

స్వర్ణాంధ్ర సృష్టికర్త, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారిని అక్రమ కేసులో ఇరికించి జైలు పాల్జేసి జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు వాళ్లకు వాళ్లే డప్పు కొట్టుకుంటున్నారు. అసెంబ్లీలో మహిళా బిల్లు గురించి వైసీపీ మాట్లాడటం సిగ్గుచేటు. 1996లోనే మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదీ మహిళాభ్యున్నతి పట్ల చంద్రబాబు నిబద్ధత. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే. ఆవిర్భావం నుంచి మహిళల ఉన్నతికి తెలుగుదేశం పాటుపడుతోంది. మగవారితో సమానంలో ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారు. తెలుగునాట మహిళలకు ఆస్తిలో సగం, ఎన్నికల్లో రిజర్వేషన్లు అంటూ స్త్రీ అభ్యున్నతి ప్రగతి బాట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది.

మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు డ్వాక్రా స్థాపించి వారి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేస్తే డ్వాక్రాకు జగన్ రెడ్డి తూట్లు పొడిచాడు. డ్వాక్రా పొదుపు నిధులను కాజేశాడు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయని డ్వాక్రా మహిళలు దశాబ్ధాలుగా దాచుకున్న అభయహస్తం నిధుల దోచుకున్న చరిత్ర జగన్ రెడ్డిది.

అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిహక్కు కల్పిస్తే అదే ఆస్తి పంచాల్సి వస్తుందని చెల్లిని గెంటేసిన జగన్ రెడ్డి మహిళా పక్షపాతా?తల్లిని గెంటి, చెల్లెళ్లను రోడ్లపాలు చేసిన జగన్ రెడ్డికి మహిళా బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?దీపం పథకం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రన్నను జైలు పాల్జేసిన జగన్ రెడ్డి మహిళాద్రోహిగా మిగలిపోయాడు.

కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలామ్ భార్య రహేజా భర్త, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందంటే అందుకు జగన్ రెడ్డే కారణం. మత్స్యకార మహిళ పద్మను వివస్త్రను చేస్తే నిందితులపై నేటికీ జగన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు.కర్నూలు జిల్లా మహిళా రైతు అనుమాయమ్మను ఓ భూ వివాదంలో న్యాయం చేయకపోగా ట్రాక్టర్ తో తొక్కించిన నువ్వు మహిళా బిల్లు గురించి మాట్లాడటం సిగ్గుచేటు కాదా?విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతి అత్యాచారం, తాడేపల్లి సమీపంలో గ్యాంగ్ రేప్ ఘటనలపై ఏ సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి మహిళా బిల్లు గురించి మాత్రం మాట్లాడతాననడం విడ్డూరంగా ఉంది.

రాజధానికి భూములిచ్చిన అమరావతి మహిళలను బూటుకాలితో తన్నించి అర్ధరాత్రి జైళ్లలో పెట్టి పైశాచిక ఆనందం పొందిన నువ్వు మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయిల సొమ్ము మింగుతూ మహిళల తాళిబొట్లు తెంచుతూ మహిళలను ఉద్దరించినట్టు జగన్ రెడ్డి హడావుడి చేయడం జగన్ రెడ్డికే చెల్లింది.

తొలి మహిళా స్పీకర్, విజయవాడలో మహిళా పార్లమెంటు సదస్సు, బస్ కండెక్టర్లుగా మహిళల నియామకం, మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఘనత చంద్రన్నదే.మహిళలు ఆర్థికంగా, విద్యా పరంగా ఉన్నతి సాధిస్తే అభివృద్ధి త్వరితగతిన సాధ్యమని చంద్రబాబు బలంగా నమ్మారు. అందుకే మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు 100కుపైగా సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన చంద్రన్నకు జగన్ రెడ్డికి పోలికే లేదు.

LEAVE A RESPONSE