Suryaa.co.in

Andhra Pradesh

మూడు రంగులు ఉన్న టవర్ కు జిన్నా పేరు పెట్టడం దేశ ద్రోహం

– కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వల్లూరు జయప్రకాష్

గుంటూరు: దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయి. జిన్నా టవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేశాం.26 వ తేదిన టవర్ పై జాతీయ జెండా ఎగుర వేస్తే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు.బిజేపి డిమాండ్ మేరకు టవర్ కు రంగులు మార్చారు. జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామం. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణం. మూడు రంగులు ఉన్న టవర్ కు జిన్నా పేరు పెట్టడం దేశ ద్రోహం. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్లే. బిజెపి జాతీయ జెండా ఎగుర వేస్తే మత విద్వేషాలు వస్తాయన్నారు.మీరు టవర్ కు రంగులు మార్చిన , జాతీయ జెండా పెడుతున్న ఏ మత విద్వేషాలు రాలేదు. టవర్ అంశం ముస్లిం లు , హిందువుల కోసం కాదు.దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలి. రెండు మతాల మద్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తుంది.

టవర్ పేరు మార్చకపోతే బిజేపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది
– యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్
భారత దేశంలో గుంటూరు లో జిన్నా టవర్ ఉండటం ఒక మచ్చ. జిన్నా పాకిస్థాన్ జాతి పిత. స్వాతంత్ర్యానికి ముందు హిందూ, ముస్లింలు కలిసే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి దేశ విభజనకు జిన్నా కారణమయ్యారు. దేశ విభజన సమయంలో యాభై వేల మంది హిందువులు చనిపోయారు. గత డెబ్భై ఐదేళ్ళుగా పాకిస్తాన్ ఉగ్రవాదం తో పోరాడుతున్నాం. కార్గిల్ వార్ జరిగినప్పుడే జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశాం. 1968లోనే వాజ్ పేయ్ జిన్నా టవర్ పేరు మార్చాలని చేబ్రోలు హనుమయ్యకు సూచించారు. జిన్నా టవర్ పేరు తిరిగి పెట్టడం ద్వారా వైసిపి పతనం ప్రారంభమవుతుంది. మీము ముస్లింలకి వ్యతిరేకం కాదు. అందుకే అబ్దుల్ కలాం పేరు పెట్టమంటున్నాం. ఉగ్రవాదుల దాడుల్లో ముస్లింలు చనిపోతున్నారు. ఉగ్రవాదులు బాంబులు వేస్తుంది భారతీయుల మీద.

LEAVE A RESPONSE