– కొత్త ఓటర్లను చేర్పించండి
– దొంగ ఓట్లను ఏరి వేయించండి
– పార్టీ శ్రేణుల భాగస్వామ్యం పెరగాలి
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల
హైదరాబాద్ : ఎన్నికల జాబితాపై కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రావుల చంద్రవేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను పార్టీ రెండు రాష్ట్రాల్లో సీరియస్‌గా తీసుకుంటోందని చెప్పారు. కొత్త ఓటర్లను చేర్పించడం, మృతి చెందిన ఓటర్లను గుర్తించడం, దొంగ ఓట్లను ఏరి వేయించడం పార్టీ నేతలు బాధ్యతగా తీసుకోవాలన్నారు. టీడీపీ సానుభూతిపరులను గుర్తించి, వారిని ఓటర్లుగా చేర్పించే బాధ్యత తీసుకోవాలని రావుల సూచించారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్ష్లులు రాఘవేంద్ర ప్రతాస్ అధ్యక్ష్లతన సికింద్రాబాద్, హైదరాబాద్, మాల్కాజ్ గిరి, చేవెళ్ల, పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గోన్న పార్టీ పోలిట్ బ్యురో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణులు పాలు కోవాలని సూచించారు.
2023 జూన్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో చేర్చుతూ.. అనర్హులను తొలగించేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఇదే అంశంపై జూలై 25 న మిగతా పార్లమెంట్ నియెజకవర్గాల నాయకులతో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్ష్లులు సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ఫ్రధాన కార్యదర్శి అజ్మీరా రాజు నాయక్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులు మద్దురి సాయితులసి, పెద్దోజు రవీంద్ర చారీ, బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్ష్లులు పి సాయిబాబా, అదిలాబాద్ పార్లమెంట్ అద్యక్ష్లులు గుళ్లపల్లి అనంద్, జుబ్లీహిల్స్ నియెజకవర్గ కోఆర్డినేటర్ జివిజి నాయుడు, నాంపల్లి నియెజకవర్గ కోఅర్డినేషన్ సభ్యులు బాలక్రిష్ణ, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు షేక్ ఆరిఫ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు నల్లేల కిషోర్, బాలరాజ్ గౌడ్, పార్టీ నాయకులు ప్రశాంతి యాదవ్, చేవేళ్ల పార్లమెంట్ నాయకులు జగదీశ్ రెడ్డిలు పాల్గొన్నారు.