విజయవాడ డిసెంబర్ 25: స్థానిక నోవాటెల్ హోటల్లో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్బంగా క్రిస్మస్ కేకును జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు కట్ చేసారు. ఈ సందర్బంగా జస్టిస్ వెంకటరమణ మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీకన్నారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, జెడ్పి సీఈఓ, ఫాస్టర్లు, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.