Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రిగారూ.. మీ ఇసుక పాలసీపై ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

– టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు

అక్రమార్జనే ధ్యేయంగా వైసీపీ నాయకులు నదీ గర్భాల్లో ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాలను, హైకోర్టు ఆదేశాలను, ఎన్జీటీ తీర్పును సైతం లెక్కచేయకుండా విలువైన ఇసుకను ఎక్కువ ధరకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. వైసీపీ ఇసుకాసురుల దోపిడీ పథకానికి సామాన్య ప్రజలు బలవుతున్నారు. సహజ వనరులను లూటీ చేస్తూ భవిష్యత్‌ తరాలకు తీరని ద్రోహం చేస్తున్న ఇసుక అక్రమాలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

1. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేస్తూ.. ప్రభుత్వం చెబుతున్న దానికంటే అధికంగా ఇసుకను విక్రయిస్తున్నారు.
2. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు ఇసుక పాలసీని ఎందుకు మార్చారు? ఎవరి ప్రయోజనాల కోసం?
3. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్‌లన్నింటినీ మొదట జేపీ సంస్థకు అప్పగించి అక్కడ నుంచి టర్న్‌ కీకి, ఆ తర్వాత బ్రాక్‌స్టన్‌ ఇన్‌ఫ్రా, కేకేఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థలకు ఆ తర్వాత మరో సంస్థకు బదలాయించాల్సిన అవసరం ఏమిటి? వీరందరినీ అడ్డు పెట్టి వైసీపీ నేతలే ఇసుక క్వారీలు నిర్వహించడం లేదా?

4. రాష్ట్రంలో జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తుందా? లేదా? అని ఎందుకు సమాధానం చెప్పడం లేదు?
5. ఇసుక రీచ్‌ల వద్ద కంప్యూటర్‌ బిల్స్‌ ఇవ్వకుండా ఆన్‌లైన్‌ డిపాజిట్లు తీసుకోకుండా చేతి బిల్లులు ఇస్తూ కేవలం నగదు లావాదేవీలే ఎందుకు నిర్వహిస్తున్నారు.
6. ఇసుక రీచ్‌ల్లో వసూలైన నగదును వైసీపీ పెద్దల నుండి తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దల వరకు చేర్చేందుకు మాత్రమే నగదు తీసుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం కాదా?

7. కొవ్వూరుకు చెందిన ప్రేమ్‌రాజ్‌ వద్ద రూ.25 కోట్లు డిపాజిట్‌గా తీసుకుని ఇసుక కాంట్రాక్టు ఇవ్వకుండా వేధించి డబ్బు డిపాజిట్‌ కూడా తిరిగి ఇవ్వకుండా ఆయన ప్రాణాలు బలిగొన్న సంఘటనపై కూడా ప్రభుత్వం సమగ్ర విచారణ జరపకుండా వాస్తవాలు సమాధి చేయడం నిజం కాదా?
8. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను రూ.80 వేల నుంచి రూ.1 లక్షల వరకు చేసి సామాన్యులను దోచుకోవడం నిజం కాదా?
9. ప్రభుత్వం చెబుతున్న టన్ను ధర రూ.475 రాష్ట్రంలో ఎక్కడైనా అమలవుతోందా? ప్రతిరోజూ విక్రయ ధర అంటూ పత్రికల్లో పెద్దపెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇస్తున్న గనుల శాఖ అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్న విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు?

10. దేశంలో అత్యంత అరుదైన ఖనిజంగా పేరు పొందిన నెల్లూరు జిల్లా సిలికా శాండ్‌ గనులన్నింటినీ వైసీపీ నేతలు ఆధీనంలోకి తీసుకుని అసలు యజమానులకు టన్నుకు రూ.100 ఇచ్చి వైసీపీ నేతలు టన్ను రూ.1400 నుంచి రూ.2000 వరకు అమ్ముకుంటూ రూ.3 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
11. పొరుగు రాష్ట్రాలకు ఇసుక సరఫరా చేయడం లేదని గనుల శాఖ ఒకవైపు చెబుతున్నా మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఇసుక లారీలను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అడ్డుకుని సీజ్‌ చేసి నెల రోజులు గడుస్తున్నా నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
12. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజ్‌లు, వంతెనల వద్ద లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వేస్తున్న గనులశాఖ, విజిలెన్స్‌, రెవెన్యూ, ఎస్‌ఈబీలు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయడపతున్నారు?

13. ఒక మీటర్‌ తవ్వాల్సిన చోట 10 నుంచి 20 మీటర్ల మేర అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ నాలుగేళ్లలో 96 మంది ప్రాణాలను వైసీపీ ఇసుక మాఫియాకు బలి కాలేదా?
14. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 13 మే 2023కి ముగుస్తున్నా మళ్లీ టెండర్లు పిలవకుండా సబ్‌ కాంట్రాక్టులిచ్చి బాధ్యతల నుంచి తప్పుకున్న అదే సంస్థకు మరో ఏడాది పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటి?
15. ఇసుక రీచ్‌ల స్టాక్‌ పాయింట్లలో ఆన్‌లైన్‌ బిల్లులు ఉండకపోవడంతో వాస్తవ విక్రయాలకు లెక్కలు ఉండడం లేదు. వైసీపీ నేతలు చెప్పిన దొంగ లెక్కలనే ప్రభుత్వ అధికారులు పరిగణనలోకి తీసుకోవలసిన దుస్థితి నెలకొన్న విషయం వాస్తవం కాదా?

16. కొన్ని రీచ్‌లలో ఇస్తున్న బిల్లులు స్కాన్‌ చేస్తే ఎటువంటి సమాచారం రావడం లేదన్న విషయం బట్టబయలైనా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారు?
17. ఇసుక రీచ్ కేటాయిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమీప బంధువు రూ.81 లక్షలు తీసుకుని రీచ్ ఇవ్వకుండా, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది వాస్తవం కాదా? దీనికి జగన్ రెడ్డే బాధ్యుడు కాదా?
18. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న విషయం వాస్తవం కాదా?

19. ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌, ఆన్‌లైన్‌ బిల్లులు, వాహనాలకు జీపీయస్‌, చెక్‌పోస్ట్‌లు ఏమీ లేకుండా యధేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?
20. రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త ఇసుక విధానంతో బోట్స్‌మెన్‌ ఇసుక సొసైటీలు, ఇసుక కూలీలు రోడ్డున పడ్డారు.
21. ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్‌కు పైగా ఇసుక అమ్మకాలు జరుగుతాయని టన్నుకి రూ.475 చొప్పున ధర నిర్ణయించి రూ.765 కోట్లు ప్రభుత్వానికి రూ.128 కోట్లు నిర్వహణా ఖర్చులకు, రూ,72 కోట్లు జేపీ సంస్థకు అని టెండర్లు కట్టబెట్టారు. కానీ కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిగినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం నామమాత్రపు ఆదాయం చూపించారు.

LEAVE A RESPONSE