ఎమ్మెల్యే కోటాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలికి పోటీచేస్తున్న ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు బీ ఫారమ్స్ అందుకున్నారు. అనంతరం అసెంబ్లీ కార్యాలయంలో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నంబూరి శంకర్ రావు, ఉండవల్లి శ్రీదేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, జంగా కృష్ణమూర్తి ఉన్నారు.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్‌లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…