Suryaa.co.in

Andhra Pradesh

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సిగ్గుందా?

– దొంగబంగారం కేసులో ఉన్న ధనుంజయరెడ్డి, అతని బంధువులపై కేసులు పెట్టలేని రాజేంద్రనా థ్ రెడ్డి.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాడు
– డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రఘురామి రెడ్డి…. పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైసీపీ కండువాలు వేసుకోవాలి
– డీబీటీ స్కీమ్ తాలూకా పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉన్నాయా?
-నాలుగున్నరేళ్లలో సాగునీటి..వ్యవసాయ రంగాల్ని ముంచేసి.. రైతుల గొంతు కోసిన కసాయి జగన్మోసపు రెడ్డి
• టీడీపీప్రభుత్వంలో పాలనా అనుమతులు పొంది, నిర్మాణ పనులు ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టుల్ని చంద్రబాబునాయుడికి పేరొస్తుందన్న దుగ్ధతో ఆపేశాడు
• 3 నెలల్లో తన ప్రభుత్వం కథ ముగుస్తుందని తెలిసీ.. 6 నెలల్లో పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానని జగన్ చెప్పడం అబద్ధం కాదా?
• 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తబలా వాయించుకుంటూ.. తప్పుడు కేసులు పెట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు
• చంద్రబాబునాయుడు ఇరిగేషన్ రంగానికి పెట్టిన రూ.68వేలకోట్ల ఖర్చు తాలూకా లెక్కలన్నీ చెప్పడానికి నేను సిద్ధం.
• నాలుగున్నరేళ్లలో సాగునీటి రంగానికి తాను ఖర్చుపెట్టానంటున్న రూ.32 వేలకోట్ల లెక్కలు ప్రజలు ముందు ఉంచుతావా జగన్మోసపు రెడ్డి?
• డీబీటీ స్కీమ్ ద్వారా లక్షలకోట్లు ప్రజలకు ఇచ్చానంటున్న జగన్ రెడ్డి… దానికి సంబంధించిన పూర్తి వివరాలు.. వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా?
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

బీటెక్ రవిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించడం మాత్రం జగన్ కు బాగా గుర్తుంటుంది. జగన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రఘురామి రెడ్డి…. పీ.ఎస్.ఆర్ ఆంజనేయులు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైసీపీ కండువాలు వేసుకోవాలి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సిగ్గుందా? దొంగబంగారం కేసులో ఉన్న ధనుంజయరెడ్డి, అతని బంధువులపై కేసులు పెట్టలేని రాజేంద్రనా థ్ రెడ్డి.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టాడు.

రింగ్ లేదు..రోడ్డు లేదు..దాని పై చంద్రబాబుమీద కేసుపెడతారా? ఇసుకను ఉచితంగా ఇచ్చాడని కేసు పెడ తారా? ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో తప్పుజరిగిందని అక్రమ కేసు పెడతారా? కేసులు పెట్టడం.. కాసులు కొట్టేయడం తప్ప జగన్ రెడ్డికి, అతని మోచేతి నీళ్లు తాగే మీకు పరిపాలన.. ప్రజాస్వామ్యరక్షణ ఏం తెలుస్తుంది?

జగన్ రెడ్డి గొప్పులు చెబుతున్న డీబీటీ స్కీమ్ లోని గుట్టుమట్లు బయటకు వస్తే బుగ్గన.. ఆర్థికశాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయం. డీబీటీ స్కీమ్ తాలూకా పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఉన్నాయా? ఇరిగేషన్ రంగానికి చంద్రబాబునాయుడు ఖర్చుపెట్టిన .68 వేలకోట్లకు లెక్కలు చెప్తాను.. తాను ప్రజలకు ఇచ్చానంటున్న లక్షల కోట్ల సొమ్ము లెక్కలు..ఇరిగేషన్ రంగానికి ఖర్చుపెట్టానంటున్న రూ.32వేలకోట్ల లెక్కలు జగన్ రెడ్డి ప్రజల ముందు ఉంచగలడా? ” అని దేవినేని ఉమ నిలదీశారు.

పల్నాడు జిల్లాలో వరికెపూడిశెల పథకానికి చంద్రబాబునాయుడి హాయాంలోనే పాలనాపరమైన అనుమతులిచ్చి, టెండర్లు పిలిచి, నిర్మాణ పనులకోసం ఏజెన్సీ ని కూడా నియమించడం జరిగిందని, 19 హెక్టార్ల భూమికి క్లియరెన్సులు పొంది, పథకం పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 53 నెలల సమయం పట్టిందని, 3 నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి ఇప్పుడు మురిగిపోయిన టెంకాయలు కొడుతూ, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ 2019 డిసెంబర్లో ఉమ్మడి కడపజిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమకు శంఖుస్థాపన చేస్తూ జగన్ రెడ్డి ఏం మాట్లాడాడో..ఇప్పుడేం మాట్లాడుతున్నాడో ప్రజలు తెలుసుకోవాలి. (నాడు జగన్ రెడ్డి మాట్లాడిన వీడియోను దేవినేని విలేక రులకు చూపించారు) వీడియాలో జగన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయలు కొడితే దాన్ని మోసమంటారు.. అదే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. అదీ పాలనలో తేడా.” ఇలా చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు మూడు నెలల ముందు టెంకాయలు ఎందుకు కొడుతున్నాడో, ఎవర్ని మోసగించడానికి కొడుతున్నాడో చెప్పాలి. నాలుగున్నరేళ్లపాటు ఏమీ చేయకుండా.. ఆఖరి రోజుల్లో టెంకాయలు కొట్టడాన్ని మోసం అంటారన్న జగన్ రెడ్డి ..ఇప్పుడు తాను చెప్పే దేవుడి స్క్రిప్ట్ ద్వారా తన మాటల్ని దేవుడు తనకే తగిలేలా చేశాడని తెలుసుకోవాలి.

ఎన్నికలకు 3 నెలల ముందు మురిగిపోయిన టెంకాయలు కొట్టి… వరికపూడిశెల ఎత్తిపోతల పథకంతో పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారు జగన్ రెడ్డి?
జగన్ రెడ్డి తనకు చిత్తశుద్ది ఉందని చెప్పుకోవడం ముమ్మాటికీ తన అసమర్థత.. మోసకారీ తనాన్ని కప్పిపుచ్చుకోవడమే. చంద్రబాబునాయుడు వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు టెండర్లు పిలిచాడన్న అక్కసుతో జగన్ రెడ్డి ఆ టెండర్లు రద్దుచేసి, ఆనాడు ఇచ్చిన పనులను రద్దుచేశాడు. ఇదేనా జగన్ రెడ్డి చిత్తశుద్ది అని ప్రశ్నిస్తున్నాం. నవంబర్ 15.. అంటే నేడు టెంకాయ కొట్టాడు. మూడునెల ల్లో తనపని.. తనప్రభుత్వం పని అయిపోతోంది. వరికపూడిశెల పథకం ఎలా 6 నెలల్లో పూర్తిచేస్తాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

పల్నాడు కరువు నివారణ పథకానికి సంబంధించిన డీపీఆర్ ల కోసం జగన్ ప్రభుత్వం.. రూ.3.5కోట్లు కట్టక పోవడంతో ఏజెన్సీ పనులు ఆపేసింది. గతంలోనే చంద్రబాబునాయుడు కేవలం రూ.298 కోట్లతో ఏజెన్సీని నియమిస్తే.. ఈనాడు జగన్ రెడ్డి పెద్ద ఘనత సాధించి నట్టు రూ.308కోట్లకు అనుమతులు తెచ్చానని, పల్నాడుప్రాంతాన్ని ఉద్ధరిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు నాయుడు అనుమతించిన ఏజెన్సీతో అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి పనులు చేయించిఉంటే, కేవలం రెండున్నరేళ్లలోనే వరికపూడిశెల ప్రాజెక్ట్ పూర్తై.. పల్నాడు ప్రాంతానికి నీళ్లు వచ్చేవి. మాచర్ల, గురజాల, వినుకొండ నియోజక వర్గాలు సస్యశ్యామలమయ్యేవి. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందన్న దుగ్థతోనే జగన్ రెడ్డి మాచర్లలో టీడీపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని గాల్లో పెట్టేశాడు.

పెళ్లిరోజు రైతుల్ని ఉద్ధరిస్తున్నానని మోసపు మాటలు చెప్పి.. ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని ముంచేసిన జగన్ రెడ్డి ఏకంగా ప్రజలచెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాడు
పెళ్లిరోజు అనేది అందరికీ ఎంతో పవిత్రమైనది.. సంతోషకరమైనది. అలాంటి పెళ్లిరోజున జగన్ రెడ్డి గతంలో చంద్రబాబునాయుడు ప్రారంభించిన ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి తన తండ్రి పేరు పెట్టుకొని పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తానని చెప్పి చివరకు పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థకు రూపాయి చెల్లించకుండా మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోయేట్టు చేశాడు. చివరకు నిర్మాణ సామగ్రిని.. నీటి పైపుల్ని.. ఇతర పరికరాల్ని వైసీపీ దొంగలు ఎత్తుకెళ్లే దుస్థితి కల్పించాడు. అదీ జగన్ రెడ్డి చిత్తశుద్ధి.

జగన్మోసపు రెడ్డి.. ఎంత మోసకారీయో.. ఎంత దోపిడీదారో..ఎంతగా ప్రజల్ని వంచిస్తాడో ప్రజలకు అర్థమైం ది. (తన పెళ్లినాడు జగన్మోసపు రెడ్డి రైతులకు చెప్పిన మోసపు మాటల్ని వీడియో ద్వారా దేవినేని ఉమా విలేకరులకు చూపించారు) ఫిబ్రవరి 2021 నాటికి ముక్త్యాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పూర్తిచేస్తానని సెపితివి కదా జగన్ రెడ్డి? ఏమైంది ఆ ప్రాజెక్ట్? 2023 డిసెంబర్ వస్తున్నా నేటికీ ఎందుకు పూర్తిచేయ లేదో జగన్ రెడ్డి చెప్పాలి. ఆ పథకం పూర్తైతే నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచి ప్రోలు, వత్సవాయి ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరిగి ఉండేది.

ముక్త్యాల ఎత్తి పోతల పథకానికి రూ.489కోట్లతో చంద్రబాబునాయుడి హాయాంలోనే పాలనా పరమైన అనుమతులు ఇవ్వడం జరిగింది. నిర్మాణ సంస్థ (ఏజెన్సీ) ని నిర్ధారించి , కేవలం 12నెలల్లోనే పనులు పూర్తిచేయాలని చెప్పడం కూడా జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైతే.. ఏజెన్సీని వెళ్లగొట్టిన జగన్ రెడ్డి 14 నెలలు డ్రామాలు నడిపించి, చివరకు తన పెళ్లిరోజున కొత్తగా మరలా శంఖుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి నాడు జనం చెవుల్లో ఏకంగా క్యాలీఫ్లవర్లే పెట్టాడు.

చివరకు ముక్త్యాల ఎత్తిపోతల పథకం మొత్తం ఎత్తిపోయేలా చేసిన ఈ జగన్మోసపు రెడ్డి.. ఇప్పుడు పల్నాడు రైతాంగాన్ని..అక్కడి ప్రజల్ని ఉద్ధరిస్తానని ఎన్నికల ముందు కలరింగ్ ఇస్తున్నాడు. కేవలం పల్నాడు వాసుల్ని మోసగించడానికి.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని కప్పిపుచ్చడానికే నేడు జగన్ రెడ్డి మాచర్ల సాక్షిగా ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పాడు.

బాబాయ్ హత్యకేసు నుంచి బయటపడటం కోసం ఏకంగా రాష్ట్రప్రయోజనాల్ని .. పోలవరాన్నే తాకట్టు పెట్టేశాడు ఈ జగన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయింది మొదలు నేటివరకు జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఒక్కఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చాడా? పోలవరం హెడ్ వర్క్స్ కు ఏకంగా సంవత్సరం పాటు హాలిడే ప్రకటించాడు. వంశ ధార-నాగావళి-గోదావరి అనుసంధాన పనులకు తిలోదకాలిచ్చాడు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి మంగళం పాడాడు. ఇదీ జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ తో సాధించిన రివర్స్ పాలన. 31 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని కూడా పోలవరం డీపీఆర్-2ను కేంద్రప్రభుత్వంతో ఆమోదింపచేయించు కోలేని అసమర్థుడు జగన్ రెడ్డి.

బాబాయ్ హత్యకేసు నుంచి తనను..తన తమ్ముడు అవినాశ్ రెడ్డిని కాపాడుకోవడానికి ఏకంగా జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ను తాకట్టుపెట్టేశాడు. షెడ్యూల్ -9, 10 ప్రకారం రాష్ట్రవిభజన చట్టంలోపేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు తాకట్టుపెట్టేశాడు. ప్రత్యేకహోదా.. వెనుకబ బడిన జిల్లాలకు రావాల్సిన నిధులు… రైల్వేజోన్.. ఉక్కుపరిశ్రమ సహా అన్నీ తాకట్టుపెట్టి ఇప్పుడు తగుదనమ్మా అంటూ మరలా ప్రజల్ని కొత్తవిద్యలతో మోసగిస్తున్నాడు ఈ జగన్మోసపురెడ్డి.

సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. రైతుల పొలాల్లో నీళ్లు ఎలా పారించాలో చంద్రబాబుని చూసి నేర్చుకో జగన్ రెడ్డి!
ప్రాజెక్టులు కట్టడమంటే, తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకోవడం.. క్రికెట్ మ్యాచులు చూడటం..చంద్రబాబు ప్రజల్లోకి వస్తే టీవీలు పగలగొట్టడం కాదు జగన్ రెడ్డి. నీటిపారుదల రంగాన్ని ఎలా నిలబెట్టాలో.. రైతుల పొలాల్లో నీళ్లు ఎలా పారించాలో చంద్రబాబుని చూసి నేర్చుకో. నీ నియోజకవర్గానికి కూడా కృష్ణా నీళ్లు అందించిన భగీరథుడు చంద్రబాబు. అదీ పరిపాలనంటే. టీడీపీ ప్రభుత్వంలో 350 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి అక్కడినుంచి ఆ నీటిని తెలుగుగంగ, గాలేరు-నగరిద్వారా, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు, కుప్పం వరకు తరలించింది.

అలాంటి గొప్ప ప్రాజెక్టులు పనిచేయకుండా చేసిన సైంధవుడు జగన్ రెడ్డి. సొంతజిల్లాకు.. సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని జగన్ రెడ్డి.. పల్నాడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తానని చెబుతుంటే, అక్కడి ప్రజలు వెనుకభాగంతో నవ్వుతున్నారు. 5ఏళ్లలో సాగునీటి రంగానికి రూ.68 వేలకోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు ఎక్కడ.. నాలుగేళ్లలో రూ.32వేలకోట్లు తన బినామీలకు..తనకు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు, విజయసాయి బినామీ కంపెనీలకు, పెద్దిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి కంపెనీలకు దోచిపెట్టి సాగునీటిరంగాన్ని పడుకోబెట్టిన జగన్ రెడ్డి ఎక్కడ? రాష్ట్ర రైతాంగం గొంతుకోసిన కసాయి జగన్ రెడ్డి. నీటి నిర్వహణ అంటే ఏమిటో తెలియని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. జగన్ రెడ్డి చేతగానితనం తో రైతుల కళ్లల్లో నీళ్లకు బదులు రక్తం వస్తోంది.

డీబీటీ స్కీమ్ గుట్టుమట్లు బయటపడితే జగన్ రెడ్డి.. బుగ్గన..ఆర్థికశాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయం
అధికారంలోకి వచ్చాక పోలవరం సహా అనేక ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి అంటే తేదీలు మార్చడంతప్ప.. జగన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రులు చేసింది శూన్యం. ఇరిగేషన్ మంత్రి ఇరిటేషన్ మంత్రిగా మారాడు. పవన్ కల్యాణ్.. లోకేశ్..చంద్రబాబుని తిట్టడం తప్ప.. అతనికి సాగునీరు విలువ ఏమిటో తెలియదు. వ్యవసాయశాఖమంత్రి కాకాణి, ఎలుకలు తిన్న కోర్టు ఫైల్స్ చుట్టూ తిరుగుతూ, టీడీపీనేతలపై పడి ఏడుస్తున్నాడు. రాష్ట్రంలో 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే, జగన్ రెడ్డి తాడేపల్లిలో తబలా వాయించుకుం టున్నాడు. పబ్జీ ఆడుకుంటూ.. ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అనంతపురం రైతుల ఆవేదన..కర్నూలు రైతుల కడుపుమంట..కడప రైతుల కష్టం ఏదీ జగన్ రెడ్డికి కనిపించడం లేదు.

LEAVE A RESPONSE