– బండి సంజయ్ నీకు తల్లి, బిడ్డ, భార్య ఉందని మర్చిపోకు
-తెలంగాణ సాంస్కృతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి కవిత
-బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా? పార్టీవా?
– మంత్రి సత్యవతి రాథోడ్
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాలి.ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదు.సంజయ్ అధ్యక్షుడు అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయి.అధ్యక్షుడు గా ఉండడం మహిళల దురదృష్టకరం.ఉద్యమ నేత బిడ్డగా తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సాంస్కృతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి కవిత.తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించింది.
రిజర్వేషన్ల కోసం పోరాడితే అవాకులు చవాకులు పేలుస్తున్నారు. హైదరాబాద్ లో ధర్నా ఎందుకోసం… రిజర్వేషన్లు వద్దనా? మాకు మహిళ సంక్షేమం, రక్షణ, అభివృద్ధి ముఖ్యం.షీ టీమ్స్ తెస్తే ఇతర రాష్ట్రాలు నేర్చుకొని వెళ్లాయి.బిజెపికి అరాచకాలు, సంస్కారం లేని మాటలే గుర్తుకు వస్తాయి.హైదరాబాద్ మహనగరాన్ని పాలించే అవకాశం మహిళకు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.తల్లి గర్భంలో నుంచి కాటికి వెళ్లే వరకు అనేక రకాలుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మా గిరిజన బిడ్డలు గ్రామాలను పాలించుకునే స్థితికి వచ్చారు.మహిళా సమాజం తల దించుకునేల బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి.బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా పార్టీవా? స్పష్టం చేయాలి.బండి సంజయ్ కి భార్య తల్లి, పిల్లలు లేరా?
జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే అనగానే నోటీసులు ఇచ్చారు.దేశాన్ని దోచుకున్న దొంగలను ప్రధాని మోదీ పక్కన పెట్టుకున్నాడు.వాళ్ళ మీదకు సీబీఐ పోదు… ఈడీ పోదు.ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐ వేటకుక్కల మాదిరిగా పంపిస్తారు… వారు పార్టీలో చేరగానే అన్ని మాఫీ అవుతాయి.ఈడీ కేసులు కాదు మోడీ కేసులని ప్రజలకి తెలుసు. మీ వేట కుక్కలకు తెలంగాణ బిడ్డలు భయపడరు.బిజెపి మెడలు వంచే రోజు… పాతాళానికి పంపే రోజులు దగ్గరకు వచ్చాయి.ఈ కేసులకు భయపడం.
2018 ఎన్నికల్లో 119 స్థానాల్లో 100 స్థానాలకు పైగా డిపాజిట్ రాలేదు.2023 లో కూడా 100 స్థానాల్లో బిజెపికి డిపాజిట్ రాదు.బండి సంజయ్ నీకు తల్లి, బిడ్డ, భార్య ఉందని మర్చిపోకు.ఇలాంటి వాళ్ళను రాజకీయ బహిష్కరణ చేయాలి.పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బిజెపి నేతలు ఊచలు లెక్కపెట్టె రోజులు త్వరలోనే వస్తాయి.రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ ఎస్ అనే అంశాన్ని మర్చిపోకు.
తెలంగాణ లో గవర్నర్ చీమ చిటుక్కుమన్నా మాట్లాడతారు.బండి సంజయ వ్యాఖ్యలపై గవర్నర్ ఏం మాట్లాడుతారు అని అందరు చూస్తున్నారు.బిజెపి కి గౌరవం లేదని తేట తెల్లమైంది… మరి గవర్నర్ అభిప్రాయం ఏంటి?