Suryaa.co.in

Andhra Pradesh

పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి

2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా కార్డు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి ఇంకా కొనసాగుతున్నారు. ఈమేరకు ఓ గుర్తింపు కార్డు బయటకొచ్చింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ ప్రతినిధులకు కొత్త గుర్తింపు కార్డులను కాంగ్రెస్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిరంజీవిని 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా పేర్కొంటూ కార్డు జారీ అయింది. రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కొన్ని రోజులుగా చిరు చెబుతూ వస్తున్నారు. మరోవైపు ‘గాడ్‌ఫాదర్‌’ నుంచి ఓ పొలిటికల్‌ డైలాగ్‌ను ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డు బయటకు రావడం గమనార్హం.

LEAVE A RESPONSE