– సర్వీసు నుంచి తొలగిస్తూ ఐజి కోయ ప్రవీణ్ ఉత్తర్వు
కర్నూలు: పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసు పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువునష్టం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు.