ఢిల్లీలో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా లోకేష్‌ను ఇటీవల సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా 41A కింద విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది.