-మొన్న ఆర్.నారాయణమూర్తి ఏడ్చాడు..
-నిన్న.. రాంగోపాల్ వర్మ కళ్లు తెరిచాడు..
-ఈరోజు.. హీరోలు డోర్లు వేసుకుని ఏడుస్తున్నారు..
మీరే కదరా అయ్యా.. జగన్‌ను నెత్తిన పెట్టుకుంది..
ఆరోజు పేటీఎం పేమెంట్లు చేశాడో.. లేక.. ఇంకేం చేశాడో గానీ.. రాజ కాజ అంటూ తెగ ఊగిపోయారు.. కుల కుంపట్లు రాజేశారు.. టీవీ ఛానెళ్లలో కూర్చొని మీ కంపు నోళ్లతో జనాల్ని పిచ్చి వాళ్లను చేశారు.ఇప్పుడు
మీకు సెగ తగిలేసరికి జగన్‌కు కామన్ సెన్స్ లేదు అంటున్నారు. తిన్నింటి వాసాలు లెక్కించే మీలాంటి వాళ్ల విషయంలో జగనే కాదు.. నెక్ట్స్ వచ్చే ముఖ్యమంత్రి కూడా జాలి దయ చూపాల్సిన అవసరం లేదు.
5 కోట్ల మంది ఆంధ్రులు తమ జేబులో డబ్బులు తీసి థియేటర్‌కు వెళితేనే మీరు సెలబ్రిటీలు, డెమీ గాడ్స్ అయ్యారు. చూసిన సినిమాను రెండు మూడు సార్లు చూడబట్టే మీరు కోట్లకు పడగలెత్తారు. ఈ నేపథ్యంలో మీరు ఏం చేయాలి. వీలైనంత వరకు సొంత రాష్ట్రానికి మంచి చేయాలి. కానీ ఏం చేశారు? కుల గజ్జితో కొట్టుకుచచ్చారు.
ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించాల్సి పోయి.. చిచ్చు పెట్టారు. హైదరాబాద్ ఉండగా ఆంధ్రకు వేరే రాజధాని ఎందుకు అన్నట్లు మాట్లాడారు. అమరావతి మీద విషం కక్కారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న మీకెందుకు ఆంధ్ర గురించి.. మీ సినిమాల గురించి చూసుకోక…? చంద్రబాబు మీద పగ పట్టినట్లు దుష్ర్పచారం చేశారు. సినిమా వాళ్లకు రాజకీయాలతో ఏం పని? అంతగా రాజకీయం చేయాలనుకుంటే.. సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లో రావాల్సింది.
సినిమా ముసుగేసుకుని.. సెలబ్రిటీ అనే ట్యాగ్ తగిలించుకుని.. అమాయకులైన జనాల్ని తప్పుదారి పట్టించారు. ఈరోజున సినిమా నడ్డి విరుగుతుంటే 5 కోట్ల మంది ఆంధ్రులు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇంకో ముఖ్యమైన మాట.. మీకు ఆంధ్ర మీద ప్రేమ ఉంటే సినిమా ఇండస్ట్రీని ఆంధ్రకు తరలించండి. సినిమా వాళ్లకు వచ్చే ఆదాయంలో 60 శాతం ఆంధ్ర నుంచి వస్తోంది. ఇంకో 20 శాతం రాష్ట్రం వెలుపల ఉన్న ప్రవాసాంధ్రుల నుంచి వస్తోంది. ఆంధ్రుల ద్వారా లాభపడుతూ.. మళ్లీ ఆంధ్రుల కంట్లో దుమ్ము కొట్టే సినిమా వాళ్లపై ఒక శాతం కూడా జాలి చూపాల్సిన అవసరం లేదు.
ఇక పేర్ని నాని.. హీరో సిద్దార్థ మీద చేసిన కామెంట్ల గురించి చూద్దాం. సిద్దార్థ్ తమిళియన్. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వాడు. చాలా అంశాల్లో కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద హీరోలు.. మోదీ, కేసీఆర్, జగన్‌లను చూసి.. ప్యాంట్లు తడుపుకుంటున్న వేళ.. సిద్దార్థ్.. రియల్
హీరో లాగా విరుచుకుపడుతున్నాడు. నియంతలు, నర హంతకులు రాజ్యమేలుతున్న వేళ చెడును ప్రశ్నించాలంటే చాలా ధైర్యం కావాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. సినిమా టికెట్ల రేట్లను తగ్గించి వందల థియేటర్లు మూతపడేలా చేస్తున్న సమయంలో.. జగన్ సర్కార్‌లోని మంత్రులపై సిద్దార్థ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
దీని మీద మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. ఎక్కడో తమిళనాడులో ఉండే సినిమా నటుడికి ఆంధ్ర గురించి ఎందుకు అన్నారు. సిద్దార్థ్ తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఘన విజయాలు అందుకున్నాడు. అందువల్ల తెలుగు సినిమా రంగం గురించి మాట్లాడే హక్కు ఆయనకుంది. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తామా? లేదా? అనేది సెకండరీ. కానీ ఆయనకున్న హక్కును కాదనే హక్కు జగన్ ప్రభుత్వానికి లేదు.
సరే.. సిద్దార్థ్ తమిళయన్ అంటున్నారు. మరి రిటైర్డ్ జడ్జి చంద్రు ఎక్కడి వాడు? అసలు ఈయన ఎవరో కూడా తెలుగు వాళ్లకు జైభీమ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు. కానీ సినిమాలో చూసిన లాయర్ వేరు. వాస్తవంగా చంద్రులో ఉన్న లాయర్ వేరు అనే సంగతి.. స్వయంగా ఆయనే బయటపెట్టుకున్నారు. చాలా మంది చంద్రును దళితుడు అని అనుకున్నారు. వాస్తవానికి ఆయన దళితుడు కాదు. అయితే మరెవరు అన్న ప్రశ్న వస్తుంది. కానీ చంద్రు పుట్టు పూర్వోత్తరాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని దళిత సోదరులు.. జస్టిస్ చంద్రును తమ వాడు అనుకుంటారని.. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి కొన్ని వందల మంది దళితుల మీద చేసిన దురాగతాలను మరిచిపోయి.. చంద్రు చెప్పిన మాటను ఆలకిస్తారని జగన్‌కు ఎవరో సలహా ఇచ్చినట్లు ఉన్నారు.
జగన్ మనుషులు చంద్రుకు ఏం చెప్పారో, చంద్రు ఏం అర్థం చేసుకున్నారో గానీ.. స్వయంగా జడ్జిగా పని చేసిన వ్యక్తి న్యాయవ్యవస్థపై నోటికొచ్చిన కామెంట్లు చేశారు. ఈ విషయంలో AP హైకోర్టు ఈడ్చికొట్టినట్లు రియాక్ట్ అయింది. లైమ్ లైట్లో ఉండాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.. ఆ లైట్లు ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంతే దెబ్బకు చంద్రు సైలెంట్ అయిపోయారు.
జగన్‌తో పాటు ఆయన పార్టీ నాయకుల వ్యవహారం ఎలా ఉంటుంది అంటే.. నాలుకను ఎలాగైనా తిప్పుతారు. సిద్దార్థ్ విషయంలో పక్క రాష్ట్రం గుర్తుకు వచ్చినప్పుడు, జస్టిస్ చంద్రు విషయంలో కూడా గుర్తుకు రావాలి కదా. తమిళనాడు నుంచి జస్టిస్ కనగరాజ్‌ను, తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్యను తీసుకువచ్చారు. కనగరాజ్.. ఎలాంటి కామెంట్లు చేయనప్పటికీ.. ఈశ్వరయ్య మాత్రం ఏకంగా సుప్రీంకోర్టు జడ్జీనే టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ విషయంలో జడ్జి రామకృష్ణ ధైర్యసాహసాలను మెచ్చుకోకుండా ఉండలేం.
రామకృష్ణ.. ఈశ్వరయ్య మాట్లాడింది.. రికార్డ్ చేసి.. జగన్ సర్కార్ చేస్తున్న కుట్రను బయటపెట్టారు. దీన్ని దీష్టిలో పెట్టుకునే రామకృష్ణను అరెస్ట్ చేసి.. జైల్లో ఆయన్ను అంతమొందించడానికి కూడా ప్రయత్నించారు. జైల్లో ఉన్న అండర్ ట్రయల్స్ కావొచ్చు. శిక్షపడిన ఖైదీలు కావొచ్చు. వారు తన కేసుల్లో గట్టి సాక్షులు అవుతారు అనుకున్నప్పుడు జగన్ ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు. పరిటాల రవి కేసులో నిందితులను వరుసపెట్టి లేపేశారు. ఇవన్నీ తెలిసినప్పటికీ జడ్జి రామకృష్ణ జగన్ రెడ్డిని, పెద్దిరెడ్డిని ఎదిరించడం సామాన్యమైన విషయం కాదు.
– రామ్మోహన్