Suryaa.co.in

Telangana

దసరా పండుగలోపే పెండింగ్ బిల్లులు క్లియర్

– రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి నెల నెల వేతనాలు చెల్లిస్తాం
– ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు కొరత లేదు ఎన్ని కావాలంటే అన్ని సరఫరా చేస్తాం
– ఖమ్మం కలెక్టరేట్ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఖమ్మం: గత ప్రభుత్వం సంక్షేమ విద్యార్థులకు సంవత్సరాలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడంతో సంక్షేమ రంగం కుప్ప కూలింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తన విద్యాసంస్థల పెండింగ్ బిల్లుల కోసం 114 కోట్లు విడుదల చేశాం. పెండింగ్ బిల్లులు ప్రతినెల 50 శాతం చొప్పున మంజూరు చేస్తూ షాచురేషేషన్ పద్ధతిన ముందుకు వెళ్తాం.

గత ప్రభుత్వంలో కాస్మోటిక్ చార్జీలు వంటి చిన్న చిన్న బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టారు. మేము ప్రతి నెల క్లియర్ చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనం బిల్లులను ప్రతినెల క్లియర్ చేస్తున్నాం. 10 లక్షల లోపు ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేస్తున్నాం.

మిషన్ భగీరథంలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది, గ్రామ పంచాయతీలోని స్వీపర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీల వేతనాలు ప్రతి నెల చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. అత్యంత పేద, కిందిస్థాయి వారికి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు నెలవారీగా వేతనాలు చెల్లించేలా దసరా పండగలోపే ఏర్పాట్లు చేస్తున్నాం.

కావాల్సినన్ని ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తాం. విద్యుత్ శాఖకు సంబంధించి ఏ సమస్య ఉన్న 19 12 డయల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి అన్నారు.

రెవెన్యూ రికార్డుల అప్డేషన్ పేరుతో గత పాలకులు బినామీల పేరిట భూములను బద లాయించారు, మేము ఆక్రమణలకు గురైన చెరువులను ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాము. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు క్యాబినెట్లో ఇతరులకు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అందుకే మూసి అంశాన్ని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చర్చించారా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు ఉంది, ఆయన నిత్యం అబద్ధాలు ఆడతారు అందుకే ఎదుటివారు ఏది మాట్లాడినా ఆయనకు అబద్ధం మాట్లాడినట్టే అనిపిస్తుంది. మాది పూర్తి ప్రజాస్వామ్య క్యాబినెట్ ప్రతి అంశం పైన అందరూ మాట్లాడుతారు.

నదులను పెట్టుబడులుగా మార్చుకొని ఇతర దేశాలు ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. హైదరాబాదులో ప్రకృతి పరంగా మనకు మూసి నది ఉంది. అందులో మంచినీరుపారించి, పార్కులో నిర్మించి, ఆ ప్రాంతంలోని నిరాశ్రయులకు అక్కడే ఇల్లు నిర్మిస్తాం. మంచి వాతావరణంలో మూసి వాసులను ఉంచితే ఈ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.

వాళ్లు పాలరాతి భవనంలో ఉండాలి.. మూసి ప్రాంతంలోని నివసించేవారు మురికి కూపం లో ఉండాలా అన్నారు. మేం గత పాలకుల లాగా ఎవరినీ కలవకుండా గడిల్లో.. ద్వారాలు మూసుకొని ఉండలేదన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన ఏంటో ఆయనకే తెలుసు. గురుకులాలు ఎప్పుడు పెట్టారు? సర్వేల్, గురుకుల స్కూల్స్ జూనియర్ కళాశాలలు ఎప్పుడు వచ్చాయో అందరికీ తెలుసు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మోడల్స్ బాహ్య ప్రపంచంలో పెట్టాం. ఇంతటి నాణ్యమైన విద్యాసంస్థలు మాకు వద్దు అనుకునేవారు బయటకు వచ్చి చెప్పండి.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్పో జరుగుతుంది. ఆధునిక యంత్ర పరికరాలు, టెక్నాలజీని వినియోగించి ఎక్కువ బొగ్గును ఎలా తీస్తారు? బొగ్గు ఉత్పత్తిలో చేపడుతున్న భద్రతా చర్యలు అక్కడ ప్రదర్శిస్తారు.

సింగరేణి పెద్ద మైనింగ్ వ్యవస్థ ఆ శాఖ మంత్రిగా పలు విషయాలు తెలుసుకోవడానికి అమెరికా, జపాన్లలో పర్యటించాను. పవర్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ పవర్ ఉత్పత్తి వంటి అంశాలను ఆయా దేశాల్లో అధ్యయనం చేశాం.

విద్యారంగం లో దేశానికి తెలంగాణ ఒక మోడల్గా నిలవబోతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా, అన్ని రకాల వసతులతో 5000 కోట్లతో ఈ ఏడాది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా భూమి పూజలు చేస్తున్నాం.

LEAVE A RESPONSE