Suryaa.co.in

Andhra Pradesh

వార్డు సచివాలయం మూసివేత

– కార్యాలయంలో సిబ్బంది ఒక్కరూ లేని వైనం

మంగళగిరి : ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది, కొన్ని చోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మంగళగిరి పట్టణం మున్సిపల్ కాంపెక్స్ సెంటర్లోని 8వ వార్డు సచివాలయం మధ్యాహ్నం మూసి వేసి, సిబ్బంది వెళ్ళిపోయారు. సెక్రటరీలు కానీ , వాలంటీర్లు కానీ ఆఫీసు లో ఉండకపోవటం శోచనీయం..ఈ సచివాలయంలో ఆధార్ సమస్యల పరిష్కారం కోసం ఆధార్ సెంటర్ కూడా ఉన్నది.

సచివాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పందన కార్యక్రమ సమయం మధ్యాహ్నం గం 3 : 5 మధ్య, ఒకరిద్దరు ఉద్యోగుల తప్ప సచివాలయంలో మిగతా సిబ్బంది ఉండటం లేదని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

LEAVE A RESPONSE