Suryaa.co.in

Telangana

దళిత బందు పేరిట డబ్బులు వసూలు చేస్తే తాటతీస్తా

-దళారులకు, బ్రోకర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎల్పీ నేత భట్టి
-చింతకానిలో ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇప్పిస్తానని హామీ
-ధరలు పెంచడంలో మోడీ, కేసీఆర్ దొందూ దొందే
-దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్న మోడీ
-సంపద కలిగి ఉన్న రాష్ట్రంలో ప్రజలపై భారాలు వేయడం తగదు
– పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దళిత బంధు పేరిట లబ్ధిదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాట తీస్తామని, వారి పై పోలీస్ కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దళిత బంధు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే దళారులు, మోసగాళ్లు, బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

రాజకీయాలకు అతీతంగాచింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్శ నివారం చింతకాని, నరసింహపురం, అంతసాగర్, పందిలపల్లి, బొప్పారం, గాంధీనగర్ గ్రామాల్లో కొనసాగింది.

రాత్రికి గాంధీనగర్ గ్రామంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ గ్యాస్, ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డివిరుస్తున్నాడని విమర్శించారు.

కార్పొరేట్ శక్తులకు సంపదను పంచిపెడుతూ సామాన్య పేద ప్రజలపై భారం మోపడానికి సిగ్గు ఉండాలి అని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని కేంద్రం పై పోరాటం చేస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
నెలకు రూ.5వేలు రావాల్సిన కరెంట్ బిల్లు రూ. 96 వేలు బిల్లు వేస్తే కట్టడం సాధ్యమేనా? ప్రజలపై ఇలా కరెంటు చార్జీల భారం మోపితే సామాన్యులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

సంపద ఉన్న రాష్ట్రంలో ప్రజలపై పన్నుల భారం మోపడం కరెక్ట్ కాదని అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే గత పాలకులకు పట్టిన గతే టీఆర్ఎస్ సర్కార్ కు పడుతుందని హెచ్చరించారు. ప్రజలపై పన్నుల భారం మోపడం లో కెసిఆర్ మోడీ దొందూదొందే అని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని హెచ్చరించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు సమస్యల గోడు వెళ్లబోసుకున్న ప్రజలు
ప్రజాసమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శనివారం చింతకాని మండలం నరసింహపురం గ్రామానికి చేరుకున్న సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల గోడును వెళ్లబోసుకున్నారు. దళిత బంధు పథకం ఇవ్వాలంటే కొంతమంది దళారులు డబ్బులు
bhatti-pada1 అడుగుతున్నారని ఫిర్యాదు చేశారు. గులాబీ కండువా కప్పి ఉన్న వారికే దళిత బంధు వస్తుందని టిఆర్ఎస్ నాయకులు దళితులను బెదిరిస్తున్నారని గ్రామానికి చెందిన రవి సీఎల్పీ నేత విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు.

భూమి, సొంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి దళిత బంధు ఇప్పించాలని మహిళలు వేడుకున్నారు. దొమ్మర కులస్తులను బీసీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం లోకి మార్చాలని ఆ కులస్తులు భట్టి ని కలిసి విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పీజీ ఉన్నత చదువులు చదివిన తమ పిల్లలకు కొలువుల రాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులుగా రోజు వారి కూలీ కి వెళ్తున్నారని మొరపెట్టుకున్నారు. రెండు కరెంటు బుగ్గలు వాడుకుంటున్న ఇళ్లకు నెలకు 2వేల బిల్లు వస్తే ఎలా కడతామని, చావాలా? బతకాలా? అంటూ దొమ్మర కులస్తుల మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.

ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన ఇండ్లు కూలి పోతున్నాయని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని నరసింహాపురం దళిత మహిళలు తమ సమస్యలను విన్నవించారు. ప్రజల గొంతుక ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు పీపుల్స్ మార్చ్ ద్వారా ఒత్తిడి పెంచుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ
చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు
చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో కృష్ణా చి చి శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గ్రామాల్లో టిఆర్ఎస్, టిడిపి సి.పి.ఎం పార్టీలకు చెందిన నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తిరుపతి పుల్లయ్య , పగడాల కోటేశ్వరరావు, గోదా పెద్ద మొగులాలు, తిరుపతి పుల్లయ్య నరేష్ తదితరులు ఉన్నారు.

తెలుగుదేశం నాయకుల సంఘీభావం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు చింతకాని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు శనివారం చింతకాని మండలం జగన్నాధపురం, చింతకాని, నరసింహ పురం గ్రామాల్లో సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జెండాలను చేతబూనిన కార్యకర్తలు పీపుల్స్ మార్చ్ లో భట్టి అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్ది దీవించారు. దారిపొడవునా కార్యకర్తలు అభిమానులు బంతిపూల వర్షాన్ని కుమ్మరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనాలు పెంచాలని సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించడం పై అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన గళాన్ని వినిపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరల వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేలా చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారిని పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా పూలమాల శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని ప్రదర్శించారు.

LEAVE A RESPONSE