Suryaa.co.in

Telangana

వంగ రైతుకు భరోసా నింపిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

అమ్మబోతే అడవి కొనబోతే కొరివి లాగా ఉంది తెలంగాణలో రైతుల పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన వంకాయ కూరగాయలకు మార్కెట్లో ధర లేకపోవడంతో పాటు కూలీ డబ్బులకు సైతం దిగుబడి రాకపోవడంతో చింతకాని మండలం అనంత సాగర్ గ్రామంలో రైతు కోసూరి కృష్ణయ్య ట్రాక్టర్ తో పంటను నేలమట్టం చేస్తుండగా చూసి చలించిపోయిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లి రైతు సమస్య అడిగి తెలుసుకున్నారు.

అర ఎకరంలో సాగు చేయడానికి రూ. 30 వేల పెట్టుబడి అయ్యిందని, మార్కెట్లో ధర లేకపోవడంతో
bhatti1 దిగుబడి రూ. 5 వేలు మాత్రమే వచ్చిందని వాపోయాడు. మార్కెట్లో దళారుల దోపిడి అరికట్టాలని రైతులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆ సందర్భంలో ఈ సందర్భంగా రైతు కృష్ణయ్యకు ఓదార్చి ధైర్యం చెప్పారు.

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే సర్కారుతో సమరం చేయడానికి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని సీఎల్పీ నేత ప్రకటించారు. పంట నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వం తో మాట్లాడతానని రైతు భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE