-తాము పడిన ఇబ్బందులు బాధలను వివరించిన కాలనీవాసులు
-ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతా: భట్టి విక్రమార్క
గోదావరి వరదతో ముంచేత్తిన భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీని సిఎల్పీ బృందం సందర్శించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలకు అక్కడి ప్రజలు వరద ముంపుతో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు 70 అడుగుల ఎత్తున వరద రావడంతో పది రోజుల పాటు కట్టు బట్టలతోటి సత్రంలో తల దాచుకున్నామని ఆహార పానీయాలు కూడా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావసం నుంచి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు బాధితులు చెప్పారు.
కేసీఆర్ వచ్చింది దేనికోసం?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించడానికి వచ్చి తమ సుభాష్ నగర్ కాలనీకి రాలేదని ఆ కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. భద్రాచలంలో సుభాష్ నగర్ కాలనీ వరద ముంపునతో పూర్తిగా మునిగిపోయిందని ఆ విషయం తెలిసినప్పటికీ సీఎం కేసీఆర్ తమ కాలనీకి రాకుండా భద్రాచలానికి ఎందుకు వచ్చినట్లు అని అన్నారు. సీఎం కేసీఆర్ భద్రాచలం కి వచ్చింది వరద బాధితుల గోడు వినడానికా? లేక గోదావరి పూజలు చేయడానికా? టిఆర్ఎస్ మంత్రులు జిల్లా అధికారులు కూడా సుభాష్ నగర్ వైపు కన్నెత్తి చూడలేదని విలపిస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. భద్రాచలం ముంపు సమస్య, కరకట్ట ఎత్తు నిర్మాణానికి సాంకేతిక నిపుణుల కమిటీ వేయాలని అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు.
రూ. 45 కోట్లు ఏం చేశారో అడగండి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం మరమత్తులు ఎత్తుకోసం 2014 ముందు 45 కోట్లు రూపాయలు మంజూరు చేశామని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు ఆ నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదు టిఆర్ఎస్ నాయకులను, మంత్రులను నిలదీయాలని సుభాష్ నగర్ కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ఇసుక ర్యాంపు వద్ద నుంచి నెల్లిపాడు వరకు సుమారు 300 మీటర్ల దూరం చేయకుండా వదిలివేయడం వల్లే బ్యాక్ వాటర్ తో సుభాష్ నగర్ కాలనీ ముంపునకు గురవుతున్నదని ఈ ప్రభుత్వానికి తెలియకపోవడం అవివేకం అన్నారు. భద్రాచలంలోనే ఉండి జిల్లా మంత్రి అజయ్ ఎందుకు కాలనీకి రాలేదు టిఆర్ఎస్ నాయకులను ప్రజాప్రతినిధులను నిలదీయమన్నారు.
ఎమ్మెల్యేనే ఆదుకున్నడు
వరద ముంపునతో తీవ్ర ఇబ్బందులు పడిన సుభాష్ నగర్ కాలనీవాసులను ఎమ్మెల్యే పొడెం వీరయ్య దగ్గరుండి ఆదుకున్నారని కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. ఎమ్మెల్యే నిత్యవసర ఆహార వస్తువులు సరుకులను తమ కాలనీవాసులకు సొంత నిధులతో పంపిణీ చేశాడని వివరించారు.