సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అత్యంత గౌరవప్రదమైన నాయకుడు ఏచూరి.
రాజకీయాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్న నేత. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి నారా లోకేష్ …
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపింది. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. ప్రజా ఉద్యమాలకే జీవితం అంకితం చేసిన వారికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. అమర్ రహే కామ్రేడ్ సీతారాం ఏచూరి అని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.