Suryaa.co.in

Andhra Pradesh

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు సహాయక చర్యలను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోమవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి, భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.

వరద పరిస్థితులపై సీఎం సూచనలు:
  • బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గిందని, ఈ రోజు సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు నీటి నుంచి బయట పడతాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
  • వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు.
  • కాలువల్లో వరద ప్రవాహాలు, గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
  • విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్దరణ పూర్తి అయ్యిందని, ఈ విషయాన్ని అధికారులకు సీఎం తెలియజేశారు.
  • ఏజెన్సీ ప్రాంతాల్లో పలు ప్రదేశాల్లో ఎర్రకాల్వకు వరద వచ్చే అవకాశం ఉన్నందున, డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ గుర్తించాలని సీఎం సూచించారు.
ప్రజారోగ్యంపై చర్యలు:
  • అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎలేరు రిజర్వాయర్ పరిసరాలు:
  • ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలి
  • ఎలేరు రిజర్వాయర్ లోకి వచ్చే ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను బ్యాలెన్స్ చేసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రిజర్వాయర్ కెనాల్స్ పరిధిలో గండ్లు పడే అవకాశం ఉన్న మూడు ప్రదేశాలను గుర్తించామని, తక్షణమే మరమ్మతులు చేయాలని కలెక్టర్ సూచించారు.
స్వల్ప నష్టంతోనే బయటపడిన కలెక్టరేట్లు:
  • ధవళేశ్వరం వద్ద నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, నీటి ప్రవాహం తగ్గడంతో అది ఉపసంహరించామని తూర్పుగోదావరి కలెక్టర్ సీఎంకు తెలిపారు.
  • విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్లు, ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలపై వివరించారు.

LEAVE A RESPONSE