– కల్తీ కల్లు తాగి గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు, ఈ పాపం ప్రభుత్వానిదే
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి అధిక ధరలకు నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. తూ.గో జిల్లా రాజవొమ్మంగిలో జీలుగు కల్లు తాగి నలుగురు గిరిజనులు మరణించారు. ఈపాపం ప్రభుత్వానిదే. దీనికి పూర్తికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. మద్యం రేట్లు పెంచటం, నాసిరకం మద్యం అమ్ముతుండటంతోనే ప్రత్యామ్నాయంగా కల్లు, శానిటైజర్ వంటివి త్రాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
కరోనా సమయంలో మధ్యం రేట్లు పెంచటంతో రాష్ట్రంలో సుమారు 50 మందికిపైగా శానిటైజర్ త్రాగి ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం. ముఖ్యమంత్రి ఇకనైనా కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల గురించి ఆలోచించాలి. చనిపోయిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.