Suryaa.co.in

Andhra Pradesh

నీటి విలువ తెలియని సీఎం జగన్

-రైతుల బాధలు పట్టించుకోని వీళ్లను దేవుడు క్షమిస్తాడా?
-ప్రాజెక్ట్ ల గేట్ల నిర్వహణ చెయ్యలేని అసమర్థ ప్రభుత్వం ఇది
-ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారు
-ఒక్కరోజులో రాష్ట్రం లో నలుగురు రైతుల ఆత్మహత్యలు:- చంద్రబాబు నాయుడు
-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరు గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

పర్చూరు:-వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో తుఫాన్ తో దెబ్బతిన్న పంటపొలాలు చంద్రబాబు నాయుడు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..తుఫాన్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు, కానీ తుపాన్ తో జరిగే నష్టాన్ని తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదే. హుదుద్ తుఫాన్ సమయంలో వారం రోజుల పాటు బస్సులోనే ఉండి పరిస్ధితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే ఉన్నా. నేడు మీ పంటలు మునగటానికి కారణం ఎవరు? ఈ చేతకాని ముఖ్యమంత్రి కాదా?

నాలుగున్నరేళ్ల నుంచి ఎక్కడైనా పంట కాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్లు శుభ్రం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. కనీసం గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ద ప్రభుత్వం ఇది. నేనొస్తున్నాని తెలిసే జగన్ బయటకొచ్చి గాల్లో తిరిగి తాడేపల్లికి వెళ్లాడు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎంకు రైతుల భాధలు ఏం తెలుసు? నిన్న ఒక్క రోజునే రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి కారణం జగన్ రెడ్డి కాదా? ఈ సీఎంకి నీటి విలువ తెలియదు. పోలవరం పూర్తి చేసి ఆ నీళ్ళు కృష్ణా డెల్టాకు తీసుకురావాలి. ఇది పూర్తయితే నీటి సమస్య ఉండదు.

టీడీపీ హయాంలో పట్టిసీమ నిర్మించి జూలైలోనే నీళ్లిచ్చి పంట పొలాల్ని సస్యశ్యామలం చేశాం. నాలుగున్నరేళ్ల నుంచి పట్టిసీమ నీళ్లు మీకొచ్చాయా? జగన్ రెడ్డి పట్టిసీమను నేను నిర్మించాన్న కారణంతోనే దాని నుంచి నీళ్లు ఇవ్వలేదు. నిన్న గుండ్లకమ్మ 2 వ గేటు గొట్టుకుపోయింది, దానికి కారణం నేనని సిగ్గలేకుండా వైసీపీ మాట్లాడుతోంది. పులిచింతల గేటు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, దానికి కారణం ఎవరు? గుండ్లకమ్మలో గతేడాది 3 వ గేటు కొట్టుకుపోయింది, ఇంతవరకు ఎందుకు రిపేర్ చేయలేదని అడిగితే రిపేర్ చేయటడానిక ఎవరూ రావటం లేదని చెప్పటం సిగ్గుచేటు. రూ. 7 కోట్లు ఖర్చు చేసి గేట్లు రిపేర్ చేయలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడా? గేటు గొట్టుకుపోవటంతో 2 టీఎంసీల నీరు వృధాగా పోయింది. వీళ్లకు ఇసుకపై ఉన్న ప్రేమ రైతులపై లేదు. మీరు బాధల్లో ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులకు బాద్యత లేదా? మీ దగ్గరికి ఎందుకు రాలేదు? రైతుల బాధలు పట్టించుకోని వీళ్లను దేవుడు క్షమిస్తాడా?

నష్టపరిహారం నాడు ఎకరా వరికి రూ. 10 వేలు ఉంటే మేం రూ. 20 వేలకు పెంచాం. నేడు 15 వేలకు తగ్గించారు. పొగాకుకు అనుమతి లేదని ఆపేశారు. మద్యానికి, ఇసుకకు అనుమతి ఉందా? ప్రత్యామ్నాయ పంట చూపించి పొగాకు వద్దనాలి. నాడు పొగాకు రూ. 15 వేల నష్టపరిహారం ఇచ్చాం. గోడౌన్లలో ఉన్న శనగలు సహాయం చేశాం. ఈ తఫాన్ కి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులంతా నాశనం అయ్యారు. విపత్తుల సమయంలో నాయకుడనే వాడు ప్రజల్లో ఉండాలి, కానీ జగన్ రెడ్డి మోసం చేయటంలో దిట్ట, ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. నేరాలు చేయటంలో జగన్ రెడ్డికి అలవాటు, ఆయన మాదిరిగా నేరాలు చేసే వ్యక్తిని పర్చూరు వైసీపీ ఇన్ చార్జ్ గా నియమించారు. అప్పులు ఎక్కువగా ఉన్న రైతుల్లో దేశంలోనే ఏపీ 1 స్ధానం, కౌలు రైతుల ఆత్మహత్యలో ఏపీ 2 వ స్ధానంలో ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల ఊబిలో కూరుకుపోయారు. జగన్రెడ్డి రూ. 11 లక్షల కోట్ల అప్పులు చేశాడు, అన్ని వ్యవస్ధలను విచ్చిన్నం చేశారు.

5 ఏళ్ల నుంచి ఏమైనా మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? యువతకు ఉపాధి లేదు, రైతులకు సాయం లేదు, కాంట్రాక్టులకు బిల్లులు లేవు. ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రికి సిగ్గూ, ఎగ్గూ లేదు. మీ కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీకు న్యాయం చేస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే మరో 3 నెలల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. రేపు ఎన్నికల్లో గెలవాల్సింది వ్యక్తులు కాదు, రాష్ట్రం గెలవాలి.

మీ పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్రం కోసం ఆలోచించండి. అరాచకం రాజ్యమేలుతుంటే అందరం ఏకమవ్వాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను రాజకీయ పోరాటం చేస్తా తప్ప బూతులు మాట్లాడను హుందాగా ఉంటా. మీ కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్దం. రాబోయే 5 ఏళ్లు ఏం చేస్తానో మీకు చెప్తా. మీ అందరి ఆలోచనలు తీసుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందిచి ముందుకెళ్తాం.

పర్చూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేశారు, 90 శాతం నష్టం జరిగింది. పొగాకు పంటకు ఎకరా రూ. 50 వేలు, శనగకు రూ. 30 వేలు, పత్తికి రూ. 50 వేలు ఖర్చు చేసి రైతులు నష్టపోయారు. పత్తికి, పోగాకు ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదంటా. ‘వరికి హెక్టారుకు రూ.30వేలు, ఆక్వాకు రూ.50వేలు, మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు సాయం అందించాలి. ఇల్లు కోల్పోతే రూ. లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి రూ.20 వేలు, పశువుల . షెడ్డుకు రూ. 20వేలు, అరటికి రూ.40వేలు, పత్తికి రూ. 25వేలు, మిరపకు రూ.50వేలు, వేరుసెనగకు రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వీధి వ్యాపారులకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలి. 5 ఏళ్లలో మీలో ఎవరికైనా భీమా అందిందా? కేవలం 16 మంది రైతులకే ఒక ఎకరాలకు ఫసల్ భీమా కట్టారు. ఇంతవరకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. తుఫాన్ నష్టంపై అద్యయనానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పిలవలేదు? ఇతను సాయం చేయడు, బయట వాళ్లను సాయం చేయనివ్వడు. ప్రజలు సర్వానాశనం చేయడానికే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. తుఫాన్ నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తా.

అహంకారంతోనే జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. టీడీపీ హయాంలో నల్లమల డ్రెయిన్ కి రూ. 170 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం, కానీ నేడు పనులు నిలిపేశారు. దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది. గుంటూరు ఛానల్ విస్తరణకు రూ. 270 కోట్లు ఇచ్చాం, దాన్నీ కూడా జగన్ రెడ్డి ఆపేశారు. సాకి వాగు నిర్వహణతో మీకు ముంపు లేకుండా చేస్తాం. రైతన్నలు అధైర్యపడి అఘాయిత్యాలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామి చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు.

LEAVE A RESPONSE