– టీడీపీ శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ
కన్న తల్లి పట్ల సీఎం జగన్ రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తల్లి విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటానికి జగన్ రెడ్డికి సాయంత్రం6 గం.వరకు పట్టిందా? వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు డిల్లీ వెళ్లడానికి జగన్ రెడ్డికి సమయం ఉంది కానీ, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటానికి తీరిక లేదా? విజయమ్మను మొదట పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి తొలిగించారు, తర్వాత ఇంటి నుంచి గెంటేశారు. తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేసిన జగన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా జగన్ రెడ్డి ఎంత స్వార్దపరుడో గమనించాలి.