– మోడీ 8 ఏళ్ల పాలనలో లక్షా 75 వేల కోట్లతో గరీబ్ కళ్యాణ్ యోజన అమలు
– రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి
– ప్రజల చేతిలో చాక్లెట్ పెట్టి వారిని నిలువు దోపిడి చేసేలా జగన్ పాలన
– 6,7 తేదీల్లో రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు : నరేంద్రమోడీ 8 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు కన్నావారి తోట లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా పాకిస్తాన్, చైనాకు ధీటుగా సమాధానం చెప్పారు. తీవ్రవాద మూలాలను తీసేయటంతో ఎలాంటి ఉగ్రవాద ఘటనలు జరగలేదు. పేదరిక నిర్మూలన ఓ నినాదం మాదిరిగా కాకుండా ఆచరణలో చూపారు అని గుర్తు చేశారు.
కన్నా ఇంకా ఏమన్నారంటే…108 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.ప్రజలకు వైద్యం అందించే విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మేకిన్ ఇండియా పేరుతో పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్, రామ మందిరం వంటి సమస్యలకు పరిష్కారం చూపారు.కోవిడ్ కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా లక్షా 75 వేల కోట్లతో గరీబ్ కళ్యాణ్ యోజన అమలు చేశారు.
ఆత్మ నిర్బర్ భారత్ కింద 20 లక్లల కోట్లు ప్యాకేజి గా ఇచ్చారు.పెట్రో ధరల భారం ప్రజలకు పడకుండా పన్నులు తగ్గించారు.రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, నౌకాశ్రయం ఏర్పాటుకు చర్యలు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 6,7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో బిజెపిని 2024 ఎన్నికలకు బిజెపి శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా పర్యటన. కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కరే వేసుకున్నారు.
108 పథకాలు కేంద్రం ఇస్తే వాటిని నవరత్నాలుగా మార్చి అమలు చేస్తున్నారు. కేంద్రం 27 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రజలు గృహ నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు. ప్రజల చేతిలో చాక్లెట్ పెట్టి వారిని నిలువు దోపిడి చేసేలా జగన్ పాలన ఉంది. ప్రజలపై పన్నులు భారం మోపటం మినహా జగన్ చేసిందేమీ లేదు.
విలేఖరుల సమావేశంలో ఓబిసి మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ్ల వెంకటేష్ యాదవ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజాముద్దీన్, బిజెపి నాయకులు అడపా శివ నాగేంద్ర రావు, పాలిశెట్టి రఘు, వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు