బిఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ
బిజెపి వాళ్ళకి మాటలు ఎక్కువ…చేతలు తక్కువ
బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నారు..బండి లేదు గుండు లేదు
తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ
GHMC పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి
డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతమైంది. విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయి పని చేయవు. బిజెపి వాళ్ళకి మాటలు ఎక్కువ…చేతలు తక్కువ. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయి
హైదరాబాద్ నలుమూల లక్ష డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తున్నాం. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తాం. ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్, ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తాం. ఫంక్షన్ హాల్లు నిర్మిస్తాం.
బిఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు బండి పొతే బండి ఇస్తామన్నారు.
బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నారు..బండి లేదు గుండు లేదు డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఎక్కడైనా డబుల్ డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారా? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసిఆర్ ని ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది. కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుదాం.