– మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తూ జీ.ఓ. ఇవ్వడం పట్ల మైనారిటీల హర్షం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో మైనారిటీల భేటీ
మైనారిటీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఆయనకు రుణ పడి ఉంటామని మైనారిటీ యువతీ, యువకులు, నాయకులు అన్నారు.మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మైనారిటీ యువతీ, యువకులు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
మంత్రుల నివాసంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కలిసిన మైనారిటీలు నాయకులు ఫిరోజ్ ఖాన్ , ఫైజల్ ఖాన్, ఫసి ఖాన్, అయాన్ ఖాన్, అక్బర్, జాఫర్ పటేల్, సాజిద్, తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను మంత్రుల నివాసంలో ఆదివారం అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గజ మాల వేసి, ఒంటెతో ప్రదక్షిణలు వేయించి, కేక్ కట్ చేసి బీ.ఆర్.ఎస్. పార్టీ మలక్ పేట నాయకులు ఫిరోజ్ ఖాన్, ఫైజల్ ఖాన్, ఫసి ఖాన్, అయాన్ ఖాన్, తదితరులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు, పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.