– అమూల్ కోసం రూ.2,500కోట్ల ప్రభుత్వ సొమ్ము వెచ్చిస్తున్న జగన్మోహన్ రెడ్డి, లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల ప్రోత్సాహకాన్ని పాడిరైతులకు ఎందుకు చెల్లించడంలేదు?
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్
ఘనచరిత్ర కలిగిన సహకారవ్యవస్థలను, పాలడెయిరీలను నిర్వీర్యంచేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిచేస్తున్న ప్రయత్నాలను ప్రజలు హర్షించరని, కృష్ణాజిల్లా పశుపోషకుల సం ఘం ఏర్పాటుకు అనేకమంది గొప్పవ్యక్తులు కృషిచేశారని, సంఘం ఏర్పాటైన తొలినాళ్లలో ముక్త్యాల రాజాగారిని దానికి అధ్యక్షుడిగా నియమించారని, 1950, 60దశకాల్లో రైతుల జీవి తాలు బాగుచేయడానికి ఆనాటివ్యక్తులుపనిచేయబట్టే, నేడు కృష్ణామిల్క్ యూనియన్ అనేది సజీవంగా కొనసాగుతోందని, టీడీపీ సీనియర్ నేతలు, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
గతంలో ఏ పెద్దలైతే పాడిపరిశ్రమను నిలబెట్టడానికి కృషిచేశారో, పాడిరైతుల జీవితాల్లో సంతో షం నింపడానికి, తమప్రాంతంలో పరిశ్రమలు రావాలని ప్రయత్నించారో అలాంటి ప్రయత్నాలను ఈముఖ్యమంత్రి సర్వనాశనంచేయడం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, గుజరాత్ లోని అమూల్ డెయిరీని వృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేయడం చూస్తుంటే, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా, లేక గుజరాత్ ముఖ్యమంత్రా అ న్న సందేహం కలుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అమూల్ డెయిరీ ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు.
రాష్ట్రప్రజలపై భారంపడేలా రూ.2,500కోట్లు అప్పు చేసిమరీ ఈ ముఖ్యమంత్రి ఆ నిధులను అమూల్ కోసం వినియోగిస్తున్నాడు. నిజంగా ముఖ్యమంత్రికి, వైసీపీప్రభుత్వానికి రాష్ట్రంలోని పరిశ్రమలపై చిత్తశుద్ధి ఉంటే మూతపడిన ఒంగోలు మిల్క్ యూనియన్ ను తెరిపించడానికి రూ.150కోట్లు ఖర్చుపెట్టలేదా అని
ప్రశ్ని స్తున్నాం. ఒంగోలు యూనియన్ మూతపడితే, రేపోమాపో నెల్లూరు మిల్క్ యూనియన్ మూతపడటానికి సిద్ధంగా ఉంది. జీతాలుకూడాచెల్లించలేని దుస్థితిలో ఉన్న నెల్లూరు మిల్క్ యూనియన్ కు ఆర్థికసహాయం అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వముందా? పాలకులు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి, పొరుగురాష్ట్రంలోని అమూల్ కోసం ఏపీలోని మిల్క్ డెయిరీలను మూసేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటుకాదా?
ఎన్నికలకు ముందు సహా కార రంగంలోని డెయిరీలను ఆదుకుంటామని, మూతపడిన డెయిరీలను తెరుస్తామని, ప్రతి లీటర్ పాలకు రూ.4లు అదనంగా ప్రోత్సాహకం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజంకాదా? మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినహామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టో తనకు బైబిల్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని సహకార డెయిరీల బలోపేతానికి ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని, అమూల్ కోసం ప్రభుత్వసొమ్ముని ఎందుకు తగలేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం.
అమూల్ ఏడాదికిందట రాష్ట్రంలో పాలసేకరణప్రారంభించి, దాదాపు 30వేలమంది రైతులనుంచి 168లక్షల లీటర్ల పాలను సేకరిస్తోందని, రూ.71కోట్లను పాడిరైతులకు అందిం చిందని ముఖ్యమంత్రి నేడు చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినదానిప్రకారంచూస్తే అమూల్ వారు లీటర్ పాలకు కేవలం రూ.42.50పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో అమూల్ వారు లీటర్ కు రూ.70లు ఇస్తున్నారని పచ్చి అబద్ధాలుచెబుతున్నాడు. అమూల్ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు కేజీ ఫ్యాట్ ధర రూ.650లు ఉంటే, రాష్ట్రంలో ఉన్న సహకారడెయిరీలు రూ.700లు, రూ.750వరకు చెల్లిస్తున్నాయి.
కేజీ వెన్న ఫ్యాట్ కు ఏపీలోని పాలసహకార సంఘాలు రూ.700లు పైచిలుకు వరకు రైతులకు చెల్లిస్తుంటే, ముఖ్యమంత్రి గారు అమూల్ వచ్చాకే రైతులకు మేలుజరిగిందని అలవోకగా అబద్ధాలు చెబుతున్నారు. అమూల్ డెయిరీవారు కేజీ ఫ్యాట్ కు ఇస్తున్నధర రూ.650లు అయితే, ముఖ్యమంత్రి గారు రూ.770ఇస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటు. విజయడెయిరీ 11శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమే.
రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారంచేస్తున్న అమూల్ డెయిరీవల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. పశువులబీమాకు సంబంధించిన వందలకోట్లసొమ్ముని రైతులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన వైసీపీప్రభుత్వం, పల్లెల్లో పశువైద్యసేవలు అందించే గోపాలమిత్రల భవిష్యత్ ను అంధకారం చేసింది. పశువులకు కృత్రిమగర్భధారణ సేవలు లభించకపోవడోం గ్రామాల్లో ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. పశువైద్యులేమో పూర్తిగా వైద్యసేవలకు స్వస్తిపలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైనపనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
పశుదాణా నియంత్రణ చట్టంపేరుతో ఈ ప్రభుత్వం కొత్తచట్టం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని సహాకార డెయిరీల పరిధిలో, రైతులకు అందించే అనుబంధసేవల్లో భాగంగా పశువులదాణా అమ్మేవారు ప్రభుత్వానికి రూ.25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా? చిన్నచిన్న సొసైటీలు ఎంత దాణా అమ్ముతాయి.. అవి రూ.25వేలు కట్టేస్థితిలో ఉంటాయా అనే ఆలోచన ముఖ్యమంత్రికి లేకపోవడం సిగ్గుచేటు.
ఏవ్యాపారంలో లేని విధం గా ముఖ్యమంత్రి డెయిరీరంగాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. రూ.25 వేలుకడతారా లేదా అంటూ ఇప్పటికే అధికారులు, దాణా అమ్మేవారి మెడలపై కత్తులు పె డుతున్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన అమూల్ వారికి కూడా దాణావ్యాపారా లు ఉన్నాయి… .వాటినికూడా ఏపీలో లేకుండా చేస్తారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం.
గతంలో కూడా అమూల్ కు పాలుపోయించాలని డ్వాక్రామహిళలను, ఇతరత్రా అధికార యంత్రాంగాన్ని బెదిరించారు. అమూల్ సంస్థ కూడా ఒకసాదాసీదా డెయిరీ నిర్వహణ సంస్థే. వారు ఎక్కడైనా వ్యాపారంచేసుకోవచ్చు…దాన్నిమేం కాదనడంలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి సదరు సంస్థకోసం ప్రభుత్వసొమ్ము రూ.2,500కోట్లు ఖర్చుచేయడం, అధికారయంత్రాంగం సాయంతో ఇతరడెయిరీలు మూతపడేలా చేయడం వంటివి చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నాం.
పాడిరైతుల సంక్షేమానికి, పాడిపరిశ్రమ అభివృద్ధికి పాడుపడిన వారి కృషిని అపహా స్యంచేసేలా ముఖ్యమంత్రి చర్యలున్నాయి. అర్థసత్యాలు , అసత్యాలతో జగన్మోహన్ రెడ్డి పాడి రైతులతోపాటు ప్రజలను కూడా మోసగిస్తున్నాడు. అమూల్ సంస్థ లాభాలను ఏపీలో పంచు తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సదరుసంస్థ ఏపీకి రాకముందు బీహార్, గుజరాత్ , రాజస్థాన్, ఢిల్లీ ల్లో కూడా వ్యాపారం చేసింది. ఎక్కడైనా సరే ఆ సంస్థ తన లాభాలను పాడిరైతులకోసం వినియోగించినట్టు ముఖ్యమంత్రి నిరూపించగలడా అని ప్రశ్ని స్తున్నాం. అమూల్ అనేది గుజరాత్ దాటిబయటకు వస్తే, అన్నిసహాకారసమాఖ్యల్లా సాధార ణ పాడిరైతుల సమాఖ్యే అవుతుంది.
అదేమీ ఆకాశం నుంచి పాడిరైతులకోసం ఊడిపడింది కాదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహిస్తే మంచిది. రాష్ట్రంలో అమూల్ వారు సబర్ కాంతా మిల్క్ యూనియన్ తోపాటు, ఇతర గుజరాత్ యూనియన్ లను ప్రోత్సహిస్తున్నారు. వారికి ఈ ముఖ్యమంత్రి వత్తాసుపలుకుతున్నాడు. ఎక్కడినుంచి వచ్చినవారినో తలమీదపెట్టుకొనే బదులు రాష్ట్రంలోని పాడిపరిశ్రమలను, పాడిరైతులను ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రయత్నించడం లేదన్నదే తమప్రశ్న.
రాష్ట్రంలోని సహాకార సంఘాల ఆస్తులన్నీ వాటి పరిధిలోనే ఉంటాయి..వాటిని కబళించే ప్రయత్నాలు చేయడంవల్లే అవి మూతపడు తున్నాయి. బలవంతంగా ప్రభుత్వం పాలసేకరణ ఆపడంవల్లే ఒంగోలు మిల్క్ యూనియన్ మూతపడింది. ఒంగోలు మిల్క్ యూనియన్ బోర్డు మెంబర్లుగా ఐఏఎస్ అధికారులు, ప్రభు త్వ పెద్దలుఉన్నారు. కానీ అది మూతపడిందంటే అందుకుకారకులు వారుకాదా? ఒంగోలు యూనియన్ మూతపడినందుకు నిజంగా వారినే బాధ్యులను చేస్తూ ఉరితీయాలి.