– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్
రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలో కూడా అదేవిధమైన పంథా అనుసరిస్తూ, టీడీపీసభ్యులను సస్పెండ్ చేయించారు. జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై ప్రభుత్వం సభలో సమాధానంచెప్పడానికి ఎందుకు వెనకాడుతోంది. నాటుసారా తాగి 26 మంది చనిపోతే, జంగారెడ్డిగూడెంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడా నాటుసారా లేదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. జనాభాఅధికంగా ఉండేప్రాంతాల్లో నాటుసారా ఎలా కాస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించడం చూస్తుంటే, ఆయనకు మతి ఉందా అన్న అనుమానం కలుగుతోంది.
మంత్రి బొత్స ఏమో మండలిలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తన సొంత అభిప్రాయం చెప్పారంటున్నారు. ఎవరి సొంత అభిప్రాయాలు వారుచెప్పడానికే సభ నిర్వహిస్తున్నారా? జంగారెడ్డిగూడెంలో నాటుసారా లేకపోతే 26మంది ఎలా..ఎందుకు చనిపోయారో చెప్పమంటే రాష్ట్రంలో ఎక్కడా నాటుసారాలేదని బుకాయిస్తారా? గతంలో స్వయంగా స్పీకరే రాష్ట్రంలో నాటుసారా ఏరులైపారుతోందని చెప్పారు. పవిత్రమైన దేవాలయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం నీచాతినీచం.
3గంటలకు వైసీపీశాసనసభాపక్ష సమావేశం నిర్వహించుకోవడానికే ముఖ్యమంత్రి తమను బయటకు పంపేలా ఆదేశించారు. వివేకానందరెడ్డి చనిపోయి నేటికి మూడేళ్లు, దానిపైకూడా సభలో చర్చించకూడదనే ప్రభుత్వం తమను బయటకు పంపింది. వివేకాహత్యను ఎలాగైతే గుండెపోటుగా చిత్రీకరించారో, అదేవిధంగా సారామరణాలను సహజ మరణాలుగా ప్రభుత్వం చెబుతోంది.
సారాకాటుకి బలైనవారి జాబితాను సభలోచదువుతూ ఆ పేర్లమధ్యలో మాపేర్లు కూడా చెప్పడం ఈప్రభుత్వ అహంకారానికి సంకేతం కాదా? నాటుసారా వల్ల మరణించిన వారికుటుంబాలకు రూ.25లక్షలనష్టపరిహారం ఇవ్వాలని, ఘటనపై న్యాయవిచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్న తమడిమాండ్లపై ప్రభుత్వం స్పందించాల్సిందే.
టీడీపీ సభ్యులు మాట్లాడకుండా సభలోఎన్నాళ్లు అడ్డుకుంటారో చూస్తాం. రాబోయేరోజుల్లోకూడా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా, ఇలానే నియంత్రత్వ విధానాలతో వ్యవహరిస్తే తమపోరాటం ఇలానే ఉంటుందని స్పష్టంచేస్తున్నాం.
కక్షసాధింపు ధోరణితోనే నిన్న 5గురు టీడీపీసభ్యులనుసస్పెండ్ చేశారు : టీడీపీ శాసనసభ్యులు బెందాళం అశోక్
రెండు రోజులనుంచీ ప్రతిపక్షసభ్యులమైన తాము జంగారెడ్డిగూడెంమరణాలపై సభలో చర్చించాలని పట్టుబడుతుంటే, దానికి సమాధానంచెప్పని ప్రభుత్వం, ముఖ్యమంత్రి టీడీపీ సభ్యులు అసలు సభలోనే ఉండకూడదన్నట్టుగా కొత్తకొత్త రూల్స్ పాస్ చేయడం విచిత్రంగా ఉంది. కేవలం కక్షసాధింపుధోరణితోనే నిన్న 5గురు టీడీపీసభ్యులనుసస్పెండ్ చేశారు.
నేడు కూడా అదేపద్ధతి అనుసరించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు. ఆప్రకటన తాలూకా కాపీనికూడా తమకు ఇవ్వకుండా, మార్షల్స్ సాయంతో సభ నడపటానికి సిద్ధమయ్యారు. బయటేమో పోలీసులను అడ్డుపెట్టుకొని పాలనసాగిస్తున్న ప్రభుత్వం, అసెంబ్లీనిర్వహణనేమో మార్షల్స్ సాయంతో నడిపిస్తోంది. బహుశా దేశచరిత్రలో మార్షల్స్ సాయంతో నడుస్తున్న ఏకైక అసెంబ్లీ ఏపీ అసెంబ్లీనే అవుతుందేమో.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 26 మంది చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు మాతో చెప్పారు. సీఎం ఆయనను కాపాడుకొనుటకు, ఒక పెద్ద స్క్యామ్ ని కప్పిపెట్టటానికి హాస్యాస్పదంగా మాట్లాడారు. ముఖ్యమంత్రినో, ముఖ్య కంత్రీనో అర్థం కావడంలేదు. 33 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయస్కులు చనిపోతే అవి సహజ మరణాలనడంలో అర్థంలేదు. వివేకానందరెడ్డి చనిపోతే గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చగలిగారు.
26 మంది ప్రాణాలు లెక్కలేకుండా పోయింది. మా నాయకుడు చంద్రబాబునాయుడు జంగారెడ్డిగూడెంను సందర్శించారు. మాది ఒక బాధ్యతాయుతమైన పార్టీగా లక్ష రూపాయలు ప్రకటించాం. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని కోరాం. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వమని కోరాం. శాసనసభ నుంచి సస్పండ్ చేసినవారిని సస్పెన్షన్ ను తొలగించమని కోరాం. టీడీపీ నాయకుల గొంతు నొక్కుతున్నారు. కొత్త కొత్త రూల్స్ తెచ్చి టీడీపీ నాయకులను సస్పెండ్ చేశారు.
వారికి నచ్చిన విధంగా సభను నడిపిస్తున్నారు. శాసనసభ వైసీపీ సమావేశమైంది. మార్షల్స్ ని పెట్టుకొని సభ నడిపిన దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవు. స్పీకర్ నిష్పచ్ఛపాతంగా వ్యవహరించాలి. అందరికీ అవకాశమివ్వాలి. వారు రాసుకొని వచ్చిన పేపర్లు చదువుకుంటామంటే టీడీపీ ఒప్పుకోదు. ప్రజలందరికీ న్యాయం జరిగేంతవరకు టీడీపీ పోరాటం చేస్తుంది.
26 మంది ఆడబిడ్డల మాంగల్యం తెగిపోయింది: టీడీపీ శాసనసభ్యులు ఆదిరెడ్డి భవానీ
జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి మృతిచెందినవారిపట్ల విచారణ చేయాలని నిన్నటి నుంచి కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు. అదే ఇష్యూపై ఫైట్ చేస్తున్నాం. 26 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 26 మంది ఆడబిడ్డల మాంగల్యం తెగిపోయింది. మేం ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు.
పరిస్థితుల్ని పక్కదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి, ప్రభుత్వం చూడటం బాధాకరం. ఒక్క జంగారెడ్డి గూడెంలోనే కాదు, రాష్ట్రమంతా నాటుసారా ఏరులై పారుతోంది. దీంతో ఎంతో మంది పేద ప్రజలు బలైపోతున్నారు. దీనిపై ఒక ఎంక్వైరీ వేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఎక్వైరీతోపాటు ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
శాసనసభ వారి జాగీరులాగ మారింది. వారి ఇష్టమొచ్చినట్లు సభ నడుపుకుంటున్నారు. వారికి నచ్చినట్లుగా రూల్స్ తయారు చేసుకొని పాస్ చేసుకుంటున్నారు. ఇది ఎంతోకాలం సాగదు. ప్రజలు ప్రజాస్వామ్యంలో చూస్తున్నారు. ప్రజలు తగిన గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉంది.
శునకానందం పొందుతున్నారు: టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు
బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి శునకానందం పొందుతున్నారుగానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే విషయాన్ని మరిచారు.
ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన అసెంబ్లీ కేవలం బడ్జెట్ ని ఆమోదించుకోవడం కోసం మాత్రమే నడుపుతున్నారు. ఈ సమావేశాలు అలంకారప్రాయమయ్యాయి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. నిబంధనలన్నింటిని తుంగలో తొక్కింది. ప్రతిపక్ష పార్టీకి ఎక్కడా అవకాశమివ్వటంలేదు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారు.
నిన్న 5 మందిని సస్పెండ్ చేయడమేకాకుండా నేడు 11 మందిని సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం. మూర్ఖపు ప్రభుత్వం, ఇది ఒక రాచరిక ప్రభుత్వం. ప్రజాస్వామ్యయుతంగా గెలుపొందిన ప్రభుత్వానికి ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. రాష్ట్రంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. లక్షలాదిమంది హాహాకారాలు చేస్తున్నారు.
ప్రజల సమస్యల్ని ప్రతిపక్షం ద్వారా ప్రభుత్వం వినాలి. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ప్రతిపక్ష పార్టీ సభ్యులపై కెమెరాలు చూపడంలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాల వీడియోలను బయటికి రానివ్వటంలేదు. ప్రతిపక్ష శాసనసభ్యుల్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించకుండా ఏకంగా భౌతికంగా నెట్టుకుంటూ మార్షల్స్ చే బయటికి తీసుకెళ్ళారు.
స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారు. ప్రభుత్వం గొంతే ఆయన గొంతు కలిపారు. పవిత్రమైన అసెంబ్లీని అపవిత్రం చేశారు. వైసీపీ బాధ్యతలు విస్మరించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి 26 మంది చనిపోతే సహజంగా చనిపోతుంటారు, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? అని సీఎం అనటం అమానవీయం. అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోయినా చనిపోయిన వారి చిరునామాలు చదివాం. వారి గురించి విచారించలేదు.
వారికి ఓదార్పునివ్వలేదు. విచారణ చేసి దోషులను శిక్షించమనడం తప్పా? ప్రభుత్వానికి ఇంతటి నిర్లక్ష్య భావం పనికిరాదు. అసెంబ్లీ ప్రక్రియను మార్చుకోకపోతే ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల తరపున పోరాడుతామని టీడీపీ తరపున హెచ్చరిస్తున్నాం.
మరణానికి కూడా ఆడా..మగా పక్షపాతం ఉంటుందా?: టీడీపీ శాసనసభ్యులు మంతెన రామరాజు
నాటుసారా మరణాలను ప్రభుత్వం చిన్నవిచేసి చూపడడానికి ప్రయత్నించడం దుర్మార్గం. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు వాటిలోని వాస్తవాలను ప్రభుత్వం గుర్తించకపోతే ఎలా? టీడీపీసభాపక్షం అడిగేవాటిపై, తామిచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం స్పందించకుండా నిన్న మాపార్టీకి చెందిన సీనియర్ నేతల్ని సస్పెండ్ చేశారు. నేడు మరికొందరిని బయటకు పంపారు.
నాటుసారా తాగి చనిపోయినవారి జాబితాను సహజమరణాల లెక్కల్లో చూపుతూ ముఖ్యమంత్రి మాట్లాడారు. జనవరి, ఫిబ్రవరినెలల్లో సుమారు 60 మంది సహజంగా చనిపోయారు. కానీ నాటుసారా ఘటనవల్ల కేవలం నాలుగురోజుల్లోనే 26మంది చనిపోయా రు. చనిపోయినవారంతా మగవారే…అదికూడా వయసులోఉన్నవారే. సహజమరణాలైతే మరివారిలో ఆడవారెందుకులేరు? ముఖ్యమంత్రికి ఉన్నట్లే మరణానికి కూడా ఆడా..మగా పక్షపాతం ఉంటుందా?
మావిచారణలో నాటుసారా ప్యాకెట్ ను రూ.50కు అమ్ముతున్నారని తేలింది. ముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెం పట్టణమైతే, అక్కడ నాటుసారా ఎలా కాస్తారంటూ కొత్తభాష్యంచెప్పారు. జంగారెడ్డిగూడెం పక్కనే అటవీప్రాంతం ఉంది. అక్కడ సారా కాయకూడ దా? కాయరనిచెప్పడానికి ప్రభుత్వం వద్దఏమైనా ఆధారాలున్నాయా? నాటుసారాతాగి చనిపోయినవారంతాకూడా చనిపోవడానికి ముందు వాంతులు, విరేచనలతో బాధపడ్డారని వారువైద్యచికిత్సకోసం వెళ్లిన ఆసుపత్రివర్గాలే చెప్పాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఈబీ ఎక్కడా నాటుసారా అమ్మకుండా చేస్తోందని చెబుతున్నారు. ఎస్ఈబీ పశ్చిమగోదావరి జిల్లా లోఎన్నికేసులు పెట్టారో, నాటుసారాకాసేవారిని ఎందరిని అరెస్ట్ చేశారో, ఎన్నిచోట్ల సారాబట్టీ లు, దుకాణాలు ధ్వంసంచేశారో చెప్పగలరా? పబ్లిగ్గారోడ్లపైనా, కాలువగట్లపైనా కూర్చొని నాటుసారాతాగి, ఖాళీప్యాకెట్లు అక్కడేపడేస్తున్నారు. అలాంటిదృశ్యాలు అక్కడతిరిగేవారికి నిత్యంకనిపిస్తూనేఉంటాయి.
అయినాకూడా ఎక్సైజ్, ఎస్ ఈబీ విభాగాలు ఏంచేస్తున్నాయో తెలియడంలేదు? నాటుసారామరణాలపై ప్రభుత్వం కాస్త సీరియస్ గా దృష్టిపెట్టి, అలాంటి ఘటనలు మరలా జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.