– సీఎం రమేష్ కోడలు కూడా కమ్మ సామాజిక వర్గమే
– కమ్మల ఆత్మ బంధువు కేసీఆర్
– కేసీఆర్ కన్నా సీఎం రమేష్ గొప్పోడా ?
-రేవంత్ కు కమ్మలమీద ప్రేముంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ కమ్మలకు ఇవ్వాలి
– ఓట్లేసిన కమ్మలను కేటీ ఆర్ ఎందుకు దూరం చేసుకుంటారు ?
– కేసీఆర్ హయం లో కమ్మల ఆత్మగౌరవ భవనానికి అత్యంత విలువైన స్థలం ఇచ్చారు
– కంభం పాటి రామ్మోహన్ రావు కు సీఎం రమేష్ వల్లే టీడీపీ లో అన్యాయం
– సీఎం రమేష్ సీఎం రేవంత్ లు రహస్య భాగస్వాములు
– మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీ ఆర్ ఎస్ నేత దినేష్ చౌదరి
హైదరాబాద్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాటలు నమ్మేందుకు ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. సీఎం రమేష్ వి పిచ్చి మాటలు. కే టీ ఆర్ కమ్మ సామాజిక వర్గం గురించి ఏదో అన్నారని సీఎం రమేష్ ఇపుడు మాట్లాడుతున్నారు. కే టీ ఆర్ ఏదైనా అంటే కమ్మ నాయకులకు సీఎం రమేష్ అపుడే ఎందుకు చెప్పలేదు?
అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న నేతలు కేసీఆర్ ,కే టీ ఆర్. ఎంతో మంది నేతలను నేను చూశాను .కే సీ ఆర్ కు ఏ కులం పట్ల ద్వేషం లేదు. ఎన్ఠీఆర్ తర్వాత కమ్మలకు ఆంత ప్రాధాన్యత ఇచ్చిన నేత కే సీఆర్. కమ్మల నుంచి ఏడుగురు నాయకులకు అవకాశమిచ్చిన నేత కేసీఆర్.
పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి ఇచ్చారు. తుమ్మల కు రాజకీయ పునర్జన్మ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన నేత కేసీఆర్. నామా నాగేశ్వర్ రావు కు పార్లమెంటరీ పక్ష నేతగా అవకాశమిచ్చారు. ఖమ్మం లో పదహారు కార్పొరేటర్ల టికెట్ లు ఇచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కమ్మలకు మంచి అవకాశాలిచ్చారు.
కొండ బాల కోటేశ్వర్ రావు కు ఏడేళ్లు కార్పొరేషన్ పదవి ఇచ్చారు. తాతా మధు కు ఎమ్మెల్సీ పదవితో పాటు, ఖమ్మం జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్ష పదవి దక్కింది. తెలంగాణ లో కమ్మలకు టీడీపీ లో కూడా దక్కని ప్రాధాన్యం బీ ఆర్ ఎస్ లో దక్కింది.
బీ ఆర్ ఎస్ లో కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య మిగతా పార్టీల కన్నా ఎక్కువ. ఏ పార్టీ లో కమ్మలకు దక్కని ప్రాధాన్యత బీ ఆర్ ఎస్ లో దక్కింది. కమ్మలు ఎవరొ రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. సీఎం రమేష్ కోడలు కూడా కమ్మ సామాజిక వర్గమే. సీఎం రమేష్ కమ్మల మధ్య తగువు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కమ్మల ఆత్మ బంధువు కేసీఆర్. కేసీఆర్ కన్నా సీఎం రమేష్ గొప్పోడా ?బీజేపీ తో మాట్లాడాలనుకుంటే కేసీఆర్ డైరెక్ట్ గా మాట్లాడతాడు .మధ్యలో సీఎం రమేష్ ఎవరు ? బీజేపీ వాళ్ళు సీఎం రమేష్ ను రాజకీయ విషయాల్లో నమ్మరు. తాకులాటలు పెట్టె ధోరణి మంచిది కాదు సీఎం రమేష్ !
కాంట్రాక్టర్లకు టెండర్లు ఎలా దక్కుతాయో అందరికీ తెలుసు. బ్రోకర్ మాటలు మానుకో సీఎం రమేష్. కమ్మలు తెలంగాణ లో హాయిగా బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను ముంచి నట్టే కమ్మలను ముంచుతున్నారు.
రేవంత్ కు కమ్మలమీద ప్రేముంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ కమ్మలకు ఇవ్వాలి. గోపీనాథ్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్నది కే టీ ఆర్ యే. కమ్మల మీద ద్వేషం ఉంటే కే టీ ఆర్ ఎందుకు ఆదుకుంటారు ? కేసీఆర్ హయం లో కమ్మల ఆత్మగౌరవ భవనానికి అత్యంత విలువైన స్థలం ఇచ్చారు. తుమ్మల నాగేశ్వర్ రావు ఆ స్థలం లో భవన నిర్మాణానికి కృషి చేయాలి
సీఎం రమేష్ కవిత బెయిల్ కోసం కే టీ ఆర్ తనను నాలుగు నెలల క్రితం కలిశారన్నారు. కవిత కు బెయిల్ వచ్చింది ఎనిమిది నెలల క్రితం. దీన్ని బట్టే సీఎం రమేష్ మాట్లాడేదాంట్లో అబద్దాలే తప్ప నిజాలు లేవని తేలిపోయింది. సీఎం రమేష్ బీజేపీ లో ఎందుకు చేరారో అందరికీ తెలుసు.
కంభం పాటి రామ్మోహన్ రావు కు సీఎం రమేష్ వల్లే టీడీపీ లో అన్యాయం జరిగింది. సీఎం రమేష్ కే టీ ఆర్ ది తన సొంత సామాజిక వర్గం అని చెప్పి పనులు చేయించుకోలేదా ? సీఎం రమేష్ కాంట్రాక్టులకోసం ఎంత కైనా దిగజారుతారు. కమ్మల విషయం లో సీఎం రమేష్ కు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది ?
మరోసారి బీ ఆర్ ఎస్ అధికారం లోకి రావడం ఖాయం. కమ్మలకు మరింత న్యాయం చేసేది ఒక్క కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ హయం లో కమ్మ అధికారుల సేవలను సమర్ధంగా వినియోగించుకున్నారు. సీఎం రమేష్ చిల్లర మాటలు మానుకోవాలి
ఎంపీ సీఎం రమేష్ కే టీ ఆర్ లేవనెత్తిన అంశాలపై సూటిగా సమాధానం చెప్పలేదు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం రమేష్ కే టీ ఆర్ ను కమ్మ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంతే సీఎం రమేష్ తో ఆ మాటలు మాలాడిస్తున్నారు. ఇంకిత జ్ఞానం ,సామాజిక స్పృహ ఉన్నోడు ఎవ్వరూ కే టీ ఆర్ కమ్మలను ఏదో అన్నారని అంటే నమ్మడానికి సిద్ధంగా ఉండరు
ghmc పరిధిలో కమ్మలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీ ఆర్ ఏస్సే గెలిచింది. కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా 2018 లో కమ్మలు బీ ఆర్ ఎస్ కే ఓటు వేశారు. ఓట్లేసిన కమ్మలను కే టీ ఆర్ ఎందుకు దూరం చేసుకుంటారు ?
ఖమ్మం లో 25 అడుగుల ఎన్ఠీఆర్ విగ్రహం ఆవిష్కరించింది కే టీ ఆర్ యే. కేసీఆర్ కు ఎన్ఠీఆర్ ప్రేరణ అని కూడా ఎన్నో సార్లు అన్నారు. కమ్మలకు ఎన్నో అవకాశాలిచ్చిన పార్టీ బీ ఆర్ ఎస్. కులాల కుంపటి ని రేవంత్ సీఎం రమేష్ ద్వారా రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ లో జరిగినట్టు రాజకీయాలు తెలంగాణ లో జరగవు.
సీఎం రమేష్ సీఎం రేవంత్ లు రహస్య భాగస్వాములు. కంచె గచ్చి బౌలి భూముల విషయం లో తనపై వచ్చిన ఆరోపణలకు ముందు సీఎం రమేష్ సమాధానమివ్వాలి. కమ్మలు అపోహలు ,అనుమానాలు పెంచుకోవద్దు
ఏపీ లో కులాల పంచాయతీ తెలంగాణ కు తేవాలనే ప్రయత్నాలు ఫలించవు. కమ్మలు బీ ఆర్ ఎస్ వెంటే ఉంటారు .చిల్లర రాజకీయాలు పట్టించుకోరు. సీఎం రమేష్ పిచ్చి మాటలు మానుకోకపోతే కమ్మలే తగిన బుద్ది చెబుతారు.