– నులుకుర్తి వెంకటేశ్వరరావు
కాకినాడ: వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవర్గాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) గొప్ప భరోసాగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో కాకినాడ సిటీ నియోజకవర్గ కు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్ధిదారురాలు డి.నాగమణి భర్త రాజుబాబుకు రూ.81,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పేదల వైద్య ఖర్చులు భారీ భారంగా మారిన సమయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు. పేద ప్రజల ఊపిరిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా నిరంతరం సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండలం టిడిపి సీనియర్ నాయకులు దేవు వెంకన్న, కొండబాబు, న్యాయవాది నరేంద్ర, డిఆర్ఎస్య్సి సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
