కాకినాడ: “అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలా సీఎం సహాయనిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం పేదల మేలు కోసం కృషి చేస్తుందని మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజప్ప పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
కాకినాడ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన 5 మంది లబ్ధిదారులకు రూ. 7, లక్షల95, వేల 350 సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప మాట్లాడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే రాజప్ప తెలిపారు. ప్రజల అర్జీలు స్వీకరించి వాటిని ముఖ్యమంత్రివరకు తీసుకెళ్తూ సహకారం అందిస్తున్నందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కృషిను ఆయన కొనియాడారు.
కార్యాలయ ఇన్చార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ .. “కూటమి ప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తులు పంపిన వారం రోజుల్లోనే సహాయనిధి చెక్కులు రావడం లబ్ధిదారుల్లో సంతోషాన్ని కలిగించింది” అన్నారు. అలాగే ఒక చిన్నారి వైద్యం నిమిత్తం 80 వేల రూపాయల LOC అర్జీ చేసుకున్న 24 గంటలలో అందించడం జరిగింది అని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్నీ), చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.