Suryaa.co.in

Telangana

కేసీఆర్ చరిత్ర హీనుడుగా మారిపోతాడు

-నమో అంటే నమ్మించి మోసం చేయడం
-వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ : ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. వరంగల్ లాంటి చారిత్రాత్మక ప్రాంతం కేసీఆర్ హయాంలో మసకబారిపోయింది. కొండా సురేఖ అడిగిన గుడి, చర్చి, మసీదు కు జూన్ 30 లోపు న కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తా. మే 9 నాటికి రైతు భరోసా పూర్తి చేస్తానని సవాల్ విసిరాను. రైతు భరోసా నిధులను అడ్డుకోవాలని ఈసీకి బీజేపీ , బీఆర్ఎస్ ఫిర్యాదు చేశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు వేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు వేస్తే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేసిన కుట్ర తెలంగాణ రైతులకు తెలుసు.ఎవరు అడ్డంకలు సృష్టించినా రైతులకు చేరాల్సిన నిధులు చేరుతాయి. రైతులు, నిరుద్యోగులు, ఆడబిడ్డల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆలోచించిదా? వరంగల్ కు పదేళ్లలో ఎందుకు నిధులు ఇవ్వలేదు..బీఆర్ఎస్ నేతలు 100 రోజులు కాకముందే దిగిపొమ్మని అంటున్నారు.. దారిన పోయే దానయ్య వచ్చి సీఎం కుర్చీలో నుంచి దిగిపో అంటే పోతమా..?

కేసీఆర్ ఇక నీకు పదవి కలే.. పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.తులసి వనం లాంటి తెలంగాణ నుంచి గంజాయి , డ్రగ్స్ ను ఏరిపారేస్తున్నాం.కేసీఆర్ నీకు బుద్ధి, జ్ఞానం ఉంటే అసెంబ్లీ కి వచ్చి సలహాలు,సూచనలు ఇచ్చేది ఉండే.టెక్స్ టైల్ పార్క్ కు నిధులు రాలేదు.. బయ్యారం ఉక్కు కు పాతర వేశారు.. కేసీఆర్ లాంటి వారు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు.

కేసీఆర్ చరిత్ర హీనుడు గా మారిపోతాడు..రైతు భరోసా నిధులు ఆపిన వారి కుట్రను తిప్పికొట్టాలి.పదేళ్లలో 100 యేళ్లకు సరిపోయే విధ్వంసాన్ని చేశారు.. కేసీఆర్ ను ఇంత కాలం తెలంగాణ ఎలా భరించిందో. రాణి రుద్రమ సాక్షిగా వరంగల్ లో ఎయిర్ పోర్ట్ కు , అవుటర్ రింగ్ రోడ్ కు టెక్స్ టైల్ పార్క్ కు నిధులు ఇస్తాం. కడియం శ్రీహరి ముప్పై యేళ్ల నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేశారు.. ఆయన చిత్తశుద్దిని చూస్తే కడియం కావ్య కి టికెట్ ఇచ్చాం.కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమంలో చిత్తశుద్దితో పాల్గొన్నారు.కడియం శ్రీహరి అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించు కోవాలనుకున్నాం..

ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీ లో కడియం కావ్య పోరాటం చేస్తుంది.బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఒక అనకొండ, భూములు ఆక్రమించుకుంటే జనాలు తరిమికొట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను వరంగల్ ప్రజలు తిప్పికొట్టి కడియం కావ్య ను గెలిపిస్తారు.నమో అంటే నమ్మించి మోసం చేయడం.. మోదీని ఎవరూ నమ్మరు. మోదీ … ఆరూరి రమేష్ మహాత్మా గాంధీ కి తమ్ముడా, సత్య హరిశ్చంద్రుడా? సమయం వచ్చినప్పుడు కొండా మురళీ కి పార్టీ మంచి అవకాశం ఇస్తుంది.

LEAVE A RESPONSE