Suryaa.co.in

Andhra Pradesh

జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023–24 ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

-దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా ఏ నెలలో ఏ సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తున్నామన్నది సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ముందుగానే ప్రకటించి మరీ తదనుగుణంగా లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
-వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధి (డీబీటీ, నాన్‌ డీబీటీ) రూ. 2,96,148.09 కోట్లు
-ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి

నెలల వారీగా ప్రభుత్వం అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను సంక్షేమ క్యాలెండర్‌లో పొందుపరిచారు. ఆ వివరాలను గమనిస్తే…
ఏప్రిల్‌ 2023 – జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మే 2023 – వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
జూన్‌ 2023 – జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జులై 2023 – జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండో త్రైమాసికం)
ఆగష్టు 2023 – జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర
సెప్టెంబర్‌ 2023 – వైఎస్సార్‌ చేయూత
అక్టోబర్‌ 2023 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)
నవంబర్‌ 2023 – వైఎస్సార్‌ సున్నావడ్డీ – పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)
డిసెంబర్‌ 2023 – జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి
జనవరి 2024 – వైఎస్సార్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)
ఫిబ్రవరి 2024 – జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు–షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం
మార్చి 2024 – జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు

LEAVE A RESPONSE