– చంద్రబాబు చేసిన ద్రోహాన్ని బ్రాహ్మణ సామాజికవర్గం ఎన్నటికి మర్చిపోదు
– బాబును ప్రశ్నించే ధైర్యం లేక కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడించడం హేయం
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని టీడీపీ నేతలు ముట్టడికి యత్నించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి.. పేద అర్చక, పురోహితుల గొంతు కోసిన గత పాలకులు మరలా ఏ ముఖం పెట్టుకుని కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి యత్నిస్తారని ప్రశ్నించారు.
టీడీపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందించిన సంక్షేమంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు చర్చించే ధైర్యం లేక ఇటువంటి చర్యలకు దిగడం హేయమన్నారు. తెలుగుదేశం హయాంలో పదవులు అనుభవించడమే తప్ప గత పాలకులకు బ్రాహ్మణుల సంక్షేమం ఏనాడూ పట్టలేదని మల్లాది విష్ణు ఆరోపించారు. పథకాల అమలులోనూ పెద్దఎత్తున కోతలు విధించి.. బ్రాహ్మణుల గొంతు కోశారని విమర్శించారు. పైగా చంద్రబాబు విదిల్చిన అరకొర పథకాల గూర్చి గొప్పగా మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు.
కడుపు రగిలిన పేద బ్రాహ్మణుల ఉసురు తగిలే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణుల మనోభావాలను కాపాడారని మల్లాది విష్ణు అన్నారు. పేద బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులకు మునుపెన్నడూ లేనివిధంగా ఈ మూడేళ్ల కాలంలో పెద్దఎత్తున సంక్షేమం అందించారన్నారు. అర్చకుల ప్రతి ఒక్క న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. ఆలయాల్లో అర్చకులకు వేతనాలు పెంపుతోపాటు, బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తోందన్నారు.
బ్రాహ్మణ సంక్షేమానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 216.77 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్ల ఖర్చు చేసింది అక్షరాలా రూ. 398.18 కోట్లు. దీనిపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ఏఒక్క పచ్చ నేతకు అయినా ఉందా..? మీ హయాంలో బ్రాహ్మణులకు రూ. వెయ్యి చొప్పున ఎంత మందికి పింఛన్ అందించారు..? కేవలం 16,200 మందికి మాత్రమే అన్నది వాస్తవం కాదా..? కాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48,714 మందికి రూ.2,500/- చొప్పున పెన్షన్లు అందిస్తున్నాం.
తెలుగుదేశం అధికారం కోల్పోయే నాటికి 2018-19 సంవత్సరంలో బాకీ పెట్టిన రూ.8.70 కోట్ల కశ్యప పెన్షన్లు, గరుడ, మరియు భారతీ స్కీముల బకాయిలు చెల్లించింది ఎవరు..? సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం కాదా..? బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ద్వారా పేద బ్రాహ్మణులకు 2020-21 లో రూ. 30 కోట్లు., 2021-22 లో రూ. 38 కోట్లు., 2021-22 లో ఇప్పటివరకు రూ. 20 కోట్లు ఋణాలను ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనా కష్ట సమయంలో జర్నలిస్టులకు, ప్రైవేటు టీచర్లకు పురోహిత మిత్ర పథకం ద్వారా రూ. 12 కోట్ల వరకు రుణాలు అందించాం. బ్రాహ్మణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో రూ. 8 కోట్ల వరకు బిజినెస్ లోన్లు మంజూరు చేశాం. మీ హయాంలో బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎన్ని నిధులు విడుదల చేశారో వివరించగలరా..? ఆలయాలలో ధూప దీప నైవేద్యాల కార్యక్రమం పుట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి. కాదని ఏ ఒక్క తెలుగుదేశం నేత అయినా చెప్పగలరా..?
చంద్రబాబు పాలనలో దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కులేక దాదాపు 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది నిజం కాదా..? అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే.. గొంతెమ్మ కోర్కెలు కోరవద్దని చంద్రబాబు అవమానించిన నాడు మీరంతా ఏమైపోయారు..? పాలక మండళ్ళ పెత్తనం అధికమై అర్చకులు బలవన్మరణాలకు పాల్పడినప్పుడు.. చంద్రబాబును ఏ ఒక్కరైనా ప్రశ్నించగలిగారా..? సదావర్తి భూములు సహా దేవాలయాల భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతమైనప్పుడు మీరంతా ఎందుకు నోరు మెదపలేదు..? పైగా ఏ ముఖం పెట్టుకుని బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నిస్తారు..?
చంద్రబాబు అరకొర పథకాల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి జరిగిన మేలు కన్నా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న పథకాల ద్వారా చేకూరిన లబ్ధి అధికమన్నది జగమెరిగిన సత్యం. దేశంలో ఎక్కడా లేనివిధంగా బ్రాహ్మణులు వారి స్థాయికి తగ్గట్టు మన రాష్ట్రంలో సత్కారాలు, వసతులు పొందుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న తోడ్పాటుతో బ్రాహ్మణ సోదరులు ప్రగతిపథంలో ముందుకు దూసుకువెళుతున్నారు.
స్వతంత్ర భారతంలో ఎన్నడూ సాధించనంత అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కనుక తెలుగుదేశం నేతలు నిజానిజాలు తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందని మల్లాది విష్ణు సూచించారు. అసలైన బ్రాహ్మణ ద్రోహి చంద్రబాబు అని.. బ్రాహ్మణుల పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని.. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మరోసారి హెచ్చరించారు.