– చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు
రాజమహేంద్రవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మండలి సభ్యుడు సోము వీర్రాజు చర్చించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి, గృహ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. సమావేశం అనంతరం వీర్రాజు ముఖ్యమంత్రికి గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని బహూకరించారు.