– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
– మీడియాకు తెలిపిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ, జగన్ ప్రభుత్వం లో భర్తీ చేయకుండా వదిలేసిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భర్తీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
గతంలో జగన్ ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారు కానీ కూటమి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, అలాగే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలల్లో స్థానికులకు 95% ఇచ్చి స్థానికేతరులకు 5% ఇస్తున్నారని కానీ, మన రాష్ట్రంలో 70% స్థానికులకు, 30% స్థానికేతరులకు ఇవ్వడం వల్ల రాష్ట్ర యువతకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా మనకు కూడా 95% ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సమస్య పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మీడియాకు తెలిపారు.