– ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఎగుమతుల కోసం ప్రత్యేకంగా సొంత పోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ధన్యవాదాలు
అనకాపల్లి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం డిఎల్ పురం వద్ద 2.9 కి.మీ.ల వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకై ఆమోదం తెలుపునందుకుగాను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు ఒక లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మొదటి దశలో ఏర్పాటయ్యే ఈ ఉక్కు పరిశ్రమకు అనుసంధానంగా 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పెర్ యానమ్ సామర్థ్యం గల క్యాప్టివ్ పోర్టు ను రూ.5,816 కోట్లు వ్యయంతో జనవరి 2029 కల్లా ఏర్పాటు చేయడం ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు అదే విధంగా ఏడాదికి 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల రెండో దశ స్టీల్ ప్లాంట్ అనుసంధానంగా రెండో దశ క్యాప్టివ్ పోర్టు ను రూ.5,380 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేయబడుతుంది.
దీని ద్వారా ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించబడతాయి అని మన అనకాపల్లి జిల్లా యువతకు పుష్కలంగా ఉపాధి కల్పించడం కొరకు కూటమి ప్రభుత్వం నిజంగా కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.